Headlines

Anant Ambani: అనంత్ అంబానీ లైఫ్‌స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!


Anant Ambani:  భారతదేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ కేవలం బిలియనీర్ వారసుడిగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంక్షేమ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. 2035 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను నెట్ కార్బన్-జీరో (నికర కార్బన్ రహిత) సంస్థగా తీర్చిదిద్దే బృహత్తర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు లక్షన్నరకు పైగా జంతువులకు ఆశ్రయం కల్పిస్తున్న ‘వంతారా’ కేంద్రాన్ని ఆయన నడిపిస్తున్నారు.

అనంత్ అంబానీ 1932 డిసెంబర్ 28న గుజరాత్‌లోని చోర్వాడ్ గ్రామంలో జన్మించిన ఆయన తాత ధీరూభాయ్ అంబానీ చరిత్రను చూడాలి. యెమెన్‌లోని ఏడెన్‌లో ఒక పెట్రోలియం కంపెనీలో సుమారు ఎనిమిదేళ్లు పనిచేసిన ధీరూభాయ్, 1958లో భారత్‌కు తిరిగి వచ్చి రూ. 15,000 పెట్టుబడితో ముంబైలో మసాలా దినుసుల వ్యాపారం ప్రారంభించారు. 1966లో గుజరాత్‌లోని నరోడాలో వస్త్ర తయారీ యూనిట్‌తో మొదలైన రిలయన్స్ ప్రస్థానం ఆ తర్వాత పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనరీ, టెలికాం మరియు రిటైల్ రంగాలకు విస్తరించింది. 2005లో కుటుంబ వ్యాపార విభజన తర్వాత ముకేష్ అంబానీ రిలయన్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.

1995 ఏప్రిల్ 10న జన్మించిన అనంత్, ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న 27 అంతస్తుల, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ‘యాంటీలియా’ భవనంలో పెరిగారు. బిలియన్ డాలర్లకు పైగా విలువైన భవనంలో పెరిగినా, తల్లిదండ్రులు నీతా -ముకేష్ అంబానీ పిల్లలకు సాధారణ జీవిత విలువలను నేర్పించారు. వారానికి కేవలం రూ. 5 పాకెట్ మనీ మాత్రమే ఇవ్వడం, స్కూల్ బస్సులో ప్రయాణించడం, పెద్దలను గౌరవించడం, సేవా భావాన్ని అలవర్చుకోవడం వారి దినచర్యలో భాగంగా ఉండేది.

అమెరికాలోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంత్, భారత్‌కు తిరిగి వచ్చి రిలయన్స్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు స్వీకరించారు. 2020లో జియో ప్లాట్‌ఫార్మ్స్, 2022లో రిలయన్స్ రిటైల్, మరియు 2025లో రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులలో చేరారు. మే 2025లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు పూర్తికాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

108 కిలోల బరువు:

కేవలం 18 నెలల కఠిన వ్యాయామం, యోగా, చక్కెర లేని ఆహార నియమాలతో అనంత్ తగ్గించుకున్న బరువు.

తీవ్రమైన ఆస్త్మాతో పోరాటం, అసాధారణ మార్పు:

చిన్నతనం నుంచే అనంత్ అంబానీ తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డారు. దానిని నియంత్రించడానికి వైద్యులు ఏళ్ల తరబడి అధిక మోతాదులో స్టెరాయిడ్ మందులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ మందుల దుష్ప్రభావాల వల్ల ఆకలి పెరగడం, శరీరంలో నీరు చేరడం, మెటబాలిజం దెబ్బతినడంతో ఆయన బరువు 108 కిలోల మేర పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, మీడియా దృష్టి నిరంతరం ఉన్నప్పటికీ తల్లి నీతా అంబానీ ఆయనకు అండగా నిలిచారు. ట్రైనర్ వినోద్ చన్నా మార్గదర్శకత్వంలో అనంత్ కఠినమైన జీవనశైలిని ప్రారంభించారు. రోజుకు 1,200 నుండి 1,500 క్యాలరీల చక్కెర రహిత ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజూ 21 కిలోమీటర్ల నడక, యోగా, 5 నుండి 6 గంటల పాటు వ్యాయామం చేసి కేవలం 18 నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒకే ఒక్క ఏనుగు పిల్లతో మొదలై 3,500 ఎకరాలకు విస్తరించిన ‘వంతారా’

సుమారు 12 ఏళ్ల వయసులో జైపూర్ నుండి రణతంబోర్‌కు వెళ్తుండగా, ఎండలో నడవలేక ఏడుస్తున్న ఒక ఏనుగు పిల్లను చూసిన అనంత్ చలించిపోయారు. తల్లి నీతా అంబానీ సహాయంతో ఆ ఏనుగును రక్షించి ‘గౌరీ’ అని పేరు పెట్టారు. మావటీల వద్ద ప్రాథమిక విషయాలు నేర్చుకుని, ఆ తర్వాత జంతు వైద్యం, పునరావాసంపై శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుకున్నారు.

ఇది కూడా చదవండి: Online Shopping Refund: కేవలం 1 రూపాయి కోసం కోర్టుకెక్కిన మహిళ.. అసలేం జరిగిందంటే..!

ఆ చిన్న ప్రయత్నం నేడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3,000 నుండి 3,500 ఎకరాల్లో విస్తరించిన ‘వంతారా’ జంతు పునరావాస కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 2024లో అధికారికంగా ప్రారంభమైన ఈ కేంద్రాన్ని మార్చి 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సనాతన ధర్మంలోని ‘జీవ సేవ’ సూత్రం ప్రకారం ప్రతి ప్రాణిలో దైవాన్ని చూసే అనంత్, తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా ఈ జంతువుల సంరక్షణకే కేటాయిస్తారు.

వంతారాలో ప్రస్తుతం 2,000కు పైగా అరుదైన జాతులకు చెందిన లక్షన్నరకు పైగా జంతువులు, పక్షులు, సరీసృపాలు ఆశ్రయం పొందుతున్నాయి.
200కు పైగా ఏనుగులు, 300కు పైగా పులులు, సింహాలు, చిరుతపులులతో పాటు ఏనుగుల కోసం 220 హై-ప్రెజర్ జెట్స్ గల హైడ్రోథెరపీ కొలను ఇక్కడ ఉంది.

వన్యప్రాణి ఆసుపత్రి

ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలు, భారీ జంతువులను తరలించే క్రేన్లతో కూడిన 20కి పైగా ప్రత్యేక అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. 1932లో ప్రారంభమైన రిలయన్స్ ప్రస్థానం 2035 నాటికి నెట్ కార్బన్-జీరో లక్ష్యంతో అనంత్ చేతుల్లోకి చేరింది

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వివాహం, సామాజిక సేవ

జూలై 2024లో న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, వ్యాపారవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌తో అనంత్ అంబానీ వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జామ్‌నగర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో రిహానా సంగీత కచేరీ, మే నెలలో మధ్యధరా సముద్రంలో క్రూయిజ్ వేడుకలో కేటీ పెర్రీ మరియు బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ ప్రదర్శనలు, జూలై 5న ముంబైలో జస్టిన్ బీబర్ కచేరీ జరిగాయి. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రధాన వివాహానికి కిమ్ కర్దాషియన్, బోరిస్ జాన్సన్ సహా అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహ ఖర్చు 600 మిలియన్ డాలర్ల నుండి 1 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. భారీ ఖర్చుపై చర్చలు జరిగినప్పటికీ, నీతా అంబానీ దీనిని ‘మేడ్ ఇన్ భారత్’ సంస్కృతి, కళల ప్రపంచ ప్రదర్శనగా అభివర్ణించారు. ఇదే సందర్భంలో పాల్ఘర్‌లో వందలాది పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించి అంబానీ కుటుంబం తమ సామాజిక బాధ్యతను చాటుకుంది.

అనంత్ అంబానీ జీవనశైలిలో అత్యంత ఖరీదైన ఆస్తులు, ప్రత్యేక వాహనాలు, అరుదైన చేతి గడియారాలు ప్రముఖంగా నిలుస్తాయి. ఆయన వాచ్ కలెక్షన్ విలువ రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనంత్ అంబానీ సేకరణలో అరుదైన మెకానికల్ మరియు కస్టమ్-మేడ్ లగ్జరీ వాచీలకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇది కూడా చదవండి: December New Rules: సిలిండర్ల ధర పెరుగుతుందా? డిసెంబర్ 1 నుంచి మారే కీలక మార్పులు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *