ఆమ్లెట్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే కేవలం ఐదు నిమిషాల్లోనే చాలా టేస్టీ దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. గుడ్లు: 3, ఉల్లిపాయలు: 1/4 కప్పు , పచ్చిమిర్చి: 2 టేబుల్ స్పూన్లు , కరివేపాకు తరుగు: కొద్దిగా, జీలకర్ర: 1/4 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్: 1/2 టేబుల్ స్పూన్, పసుపు: 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె లేదా వెన్న: వేయించడానికి సరిపడ.
తయారీలోకి వెళ్లితే.. ముందుగా, మూడు గుడ్లను ఒక మిక్సింగ్ బౌల్లోకి పగలగొట్టి వేయండి. ఆమ్లెట్ మెత్తగా, పొంగుతూ రావడానికి గుడ్లను బాగా గిలకొట్టడం చాలా ముఖ్యం. నురగ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఈ ప్రక్రియ ఆమ్లెట్కు తేలికపాటి, గాలి నిండిన ఆకృతిని ఇస్తుంది. గుడ్లు బాగా గిలకొట్టిన తర్వాత, సన్నగా తరిగిన 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , 1/4 టేబుల్ స్పూన్ పసుపు, మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటినీ బాగా కలిసేలా మరోసారి కలపండి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్‌పై పెట్టి వేడి చేయండి. అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నూనె లేదా వెన్న వేయండి. గుడ్లకు నీచు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా నూనె ఎక్కువే వాడాలి. పాన్ వేడయ్యాక, రెండు గరిటెల గుడ్డు మిశ్రమాన్ని వేయండి. దానిపై మరో టేబుల్ స్పూన్ నూనెను వేసి, మంటను పూర్తిగా తగ్గించి (లో ఫ్లేమ్) ఒక నిమిషం పాటు కాల్చనివ్వండి. అధిక మంటపై పెడితే ఆమ్లెట్ అడుగున మాడిపోయి, లోపల పచ్చిగా ఉండిపోతుంది.
ఆమ్లెట్ ఒకవైపు కాలాక, మరోవైపు మలుచుకుని ఎర్రగా కాలే వరకు కాల్చండి. రెండు వైపులా చక్కగా ఉడికిన తర్వాత, ఆమ్లెట్‌ను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన గుడ్డు మిశ్రమాన్ని కూడా ఇదే పద్ధతిలో ఆమ్లెట్లుగా వేసుకోండి. అంతే టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ.
ఇలా తయారు చేసుకున్న ఫ్లఫీ ఆమ్లెట్ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రపు చిరుతిండిగా, రాత్రి భోజనానికి ఒక ఆమ్లెట్ తీసుకున్నా కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అన్నం, రోటీ, బ్రెడ్‌తో కూడా ఇది చాలా బాగా నప్పుతుంది.




