Headlines

Akkineni Akhil : ఆ సినిమాలో చాలా ఓవర్ యాక్టింగ్ చేశా.. అక్కినేని అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Akkineni Akhil : ఆ సినిమాలో చాలా ఓవర్ యాక్టింగ్ చేశా.. అక్కినేని అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..


ఎట్టకేలకు కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు అక్కినేని అఖిల్. ఇటీవల మంచి హైప్ మధ్య విడుదలైన లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈనెల 10న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తుండగా.. అఖిల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన పదకొండేళ్ల తర్వాత అఖిల్ అందుకున్న ఫస్ట్ హిట్ ఇది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తన గత చిత్రం ఏజెంట్ రిజల్ట్ పై రియాక్ట్ అయ్యారు.. ఈ సినిమా గురించి చెబుతూ తన యాక్టింగ్ పై అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..

“ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత మళ్లీ ఆ సినిమాను తాను చూశానని.. స్క్రీన్ పై నన్ను చూసుకుంటే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సీన్ లో నేను ఓవరాక్టింగ్ చేశాను. ఆ విషయం నాకే స్పష్టంగా అర్థమైంది. అలాగే రిలీజ్ కు ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఏదో తేడా కొట్టిందని గ్రహించాను. అదే విషయాన్ని నా చుట్టూ ఉండేవాళ్లకు చెప్పాను. ఒకనిర్మాత ఒక ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయాలు బడ్జెట్ పెట్టినప్పుడు ఒక హీరో వీలైనంత వరకు రికవరీ చేయాలి. అందుకే సినిమాకు చేయాలని భావించి ప్రమోట్” చేశాను అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్.. ఎందుకు తీసానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. డైరెక్టర్ వివి వినాయక్..

ఇక ఏజెంట్ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే వచ్చిన విమర్శలపై స్పందించారు. ఇక పై తాను ఏ సినిమా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని అన్నారు. 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్ పూర్తిగా మార్చేశారు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *