Ajay Ghosh: ఆయన నా జీవితాన్నే మార్చేశాడు.. నువ్వు లేకుండా సినిమా చేయను అన్నాడు.. అజయ్ ఘోష్ కామెంట్స్..

Ajay Ghosh: ఆయన నా జీవితాన్నే మార్చేశాడు.. నువ్వు లేకుండా సినిమా చేయను అన్నాడు.. అజయ్ ఘోష్ కామెంట్స్..


టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో బిజీ ఆర్టిస్ట్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్ తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారనే విషయాలను పంచుకున్నారు. సుకుమార్ నా జీవితాన్ని మార్చేశారు అని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఆయన నటించిన రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలలో సుకుమార్ దర్శకత్వంలో పని చేయడం తన సినీ జీవితానికి గొప్ప మలుపు అని వెల్లడించారు. సుమారు పదిహేను సంవత్సరాల క్రితం రన్ రాజా రన్ సినిమా ద్వారా సంపత్ మేనేజర్ చలపతితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. చలపతి తనను తమిళంలో నటించమని అడిగారని, ఆ తర్వాత వెట్రిమారన్ సినిమా కోసం ఆయనే తనను చెన్నై పిలిపించారని పేర్కొన్నారు. అప్పుడు తనకు విమానం ఎక్కడం కూడా తెలియదని, చలపతి చొరవతోనే చెన్నై వెళ్లగలిగానని వివరించారు.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

వెట్రిమారన్ ఆఫీసు సాధారణ ఆఫీసులా కాకుండా, చాలా నిరాడంబరంగా ఉందని, అక్కడ 28 రోజులు షూటింగ్ చేశానని, వెట్రిమారన్ వంటి గొప్ప దర్శకుడితో పని చేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఈ తమిళ సినిమా విడుదలైన తర్వాత, దర్శకుడు సుకుమార్ ఆ సినిమా చూసి తనను రంగస్థలంలో ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారని అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ పాత్ర తన కెరీర్‌కు ఒక ల్యాండ్‌మార్క్ అని, రామ్ చరణ్‌కు కూడా అది ప్రెస్టీజియస్ హిట్ అని అన్నారు. సుకుమార్ తనను బాగా అర్థం చేసుకున్నారని, ఆయన చెప్పే పాత్రలు సమాజంలో మనం చూసే మనుషుల లాగే ఉంటాయని, వాటిని పోషించడం తనకు సులభం అని తెలిపారు. సుకుమార్ చాలా విచిత్రమైన దర్శకుడని, ఆయన దగ్గర పాసైన వారు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరని అజయ్ ఘోష్ అన్నారు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

పుష్ప సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు పటాన్‌చెరువు మామిడి తోటలో షూటింగ్ జరుగుతోందని, వాతావరణం చాలా చల్లగా ఉందని తెలిపారు. అప్పటికే కోవిడ్ నుంచి కోలుకుంటున్న తనకు మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుందని, తన కోసం ఒక కుంపటి, ఒక టెంట్ ఏర్పాటు చేశారని అన్నారు. షాట్ జరుగుతున్నప్పుడు సుకుమార్ వచ్చి, తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి, తన నటనను ఎంతగానో మెచ్చుకున్నారని వివరించారు. “నేను ఏ సినిమా చేసినా నువ్వు లేకుండా సినిమా చేయను” అని సుకుమార్ తనతో చెప్పిన మాట తన జీవితంలో అత్యంత విలువైన గుర్తింపు అని అజయ్ ఘోష్ భావిస్తున్నారు. వెట్రిమారన్ కూడా తర్వాత రెండు మూడు సినిమాల కోసం పిలిచినా, తెలుగులో డేట్లు కుదరక వెళ్లలేకపోయానని పేర్కొన్నారు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *