తెలుగులో ‘సామజవరగమన’ సినిమా ఆమెకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రెబా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ జోమాన్ జోసెఫ్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా రెబా తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.