Headlines

Actor Kota Srinivasa Rao: ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు.. ఆ హీరో సత్తా ఉన్నోడు.. కోట శ్రీనివాస్ రావు..


ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సినీ ప్రయాణం, జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ నటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కోట శ్రీనివాసరావు విశ్లేషించారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యాప్తి గురించి ప్రస్తావించినప్పుడు, కోట శ్రీనివాసరావు ఇది మనమే తెచ్చుకున్నదని అన్నారు. మాదకద్రవ్యాలు మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఒత్తిడి వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులు కావడంతో, వారి విషయంలో ఇవి ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. “మాదకం చేస్తుంది. తాగితే బ్రెయిన్ పనిచేయదు” అని ఆయన హెచ్చరించారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

అలాగే, సామాజిక పోకడలపై మాట్లాడుతూ, ఒకప్పుడు మందు తాగడానికి పర్మిట్లు ఉండేవని, ఆ తర్వాత సరదాగా నలుగురు కలిసి తాగడానికి క్లబ్‌లు వచ్చాయని, ఇప్పుడు అవి పబ్‌లుగా మారాయని వివరించారు. ధనవంతులు తమ ఇళ్లల్లోనే పబ్‌హౌస్‌లు లేదా బార్‌లను ఏర్పాటు చేసుకోవడం గొప్పగా చెప్పుకుంటున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చిన తరువాత తాగి భార్యను కొట్టడం వంటివి జరిగి, ఆ బతుకు ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించగా, కోట శ్రీనివాసరావు ఆయనపై అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. “ఇప్పుడున్న యంగ్ స్టర్స్ లో విషయం ఉండి, సత్తా ఉన్నవాడు ఎవరన్నా నటుడు ఎవరన్నా ఉన్నాడంటే, జూనియర్ ఎన్టీఆర్. అతడి తర్వాతే ఎవరైనా” అని చెప్పారు. డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు, మాటలు, యాక్షన్.. ఏ విషయంలోనైనా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రతిభ ఉందని చెప్పారు. అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారైన నందమూరి తారకరామారావు గారే స్వయంగా బొట్టు పెట్టి, ఒడిలో కూర్చోబెట్టి రామారావు అని పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *