వేసవి తాపం తట్టుకోలేక చాలామంది ఇళ్లలో ఏసీలను వాడుతున్నారు. అయితే, ఇటీవల ఏసీలు పేలుతున్నాయనే వార్తలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.. ప్రస్తుత ఇన్వర్టర్ ఏసీలలో ‘R32’ అనే గ్యాస్ ఉపయోగిస్తారు. ఇది మండే స్వభావం కలిగింది. ఏసీ వాడే ప్రతి ఇంట్లో సరైన ఎర్తింగ్ ఉండటం తప్పనిసరి. అలాగే, ఔట్‌డోర్ యూనిట్‌కు గాలి ధారాళంగా తగిలేలా చూసుకోవాలి. వెంటిలేషన్ సరిగా లేకపోతే కంప్రెషర్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు సంభవించవచ్చు.
గ్యాస్ ప్రెషర్ ఎప్పుడూ 130-140 PSI మధ్య ఉండేలా చూసుకోవడం సురక్షితం. చాలామంది రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తారు. కానీ, రిమోట్‌తో ఆఫ్ చేస్తే ఏసీ ‘స్టాండ్‌బై’ మోడ్‌లోనే ఉంటుంది, పవర్ అందుతూనే ఉంటుంది. కాబట్టి, పని పూర్తయ్యాక లేదా బయటకు వెళ్లేటప్పుడు మెయిన్ స్విచ్(MCB) ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇది హై వోల్టేజ్ సమస్యల నుంచి ఏసీని కాపాడుతుంది. ఏసీని 16-18 డిగ్రీల దగ్గర ఉంచితే కంప్రెషర్‌పై భారం పడి కరెంట్ బిల్లు భారీగా వస్తుంది. మానవ శరీరానికి 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలం. చిన్న పిల్లలు ఉన్న గదులలో 28°C – 29°C ఉంచడం శ్రేయస్కరం. విద్యుత్ ఆదా కావాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను స్వయంగా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే కూలింగ్ వేగంగా అందుతుంది. ఏసీని కనీసం ప్రతి 9 నెలలకు ఒకసారి లేదా సమ్మర్ ప్రారంభానికి ముందు సర్వీసింగ్ చేయించుకోవాలి. టెక్నీషియన్ వచ్చినప్పుడు గ్యాస్ ప్రెషర్ 130-140 PSI మధ్య ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం వీడి, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటే ఏసీ వల్ల ఎటువంటి ముప్పు ఉండదు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..