ప్రముఖ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న రంగు వివక్ష, స్టార్ హీరోలతో పనిచేయలేకపోయిన అవకాశాలు, అలాగే అక్కినేని అఖిల్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి వివరించారు. సినిమా పరిశ్రమలో రంగుపై ఉండే అంచనాల గురించి ఆమని మాట్లాడారు. డస్కీ కలర్ ఉన్న నటీమణులు రాధిక, సరిత, వాణిశ్రీ, రోజా వంటివారు తమ రంగు గురించి కామెంట్లు ఎదుర్కొన్నా, అపారమైన ప్రతిభతో అగ్రస్థానానికి చేరి, దర్శకుల, నిర్మాతల డేట్స్ కూడా దొరకనంత బిజీ అయ్యారని గుర్తు చేశారు. తనకు కూడా కెరీర్ మొదట్లో రంగు తక్కువ అనే కామెంట్లు వచ్చాయని, ఉత్తరాది నుంచి నగ్మా వంటి అందమైన, ఎత్తైన నటీమణులు వచ్చినప్పుడు, వారి పక్కన తమను చూసినప్పుడు కొంచెం ఫీల్ అయ్యేవారని తెలిపారు. అందుకే తనకు అవకాశాలు వెంటనే దొరకడం కష్టమైందని ఆమని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనే తన కోరిక, అందుకు దక్కిన, కోల్పోయిన అవకాశాల గురించి ఆమని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
రిక్షావోడు చిత్రంలో హీరోయిన్గా ఎంపికై, షూటింగ్‌కు 15 రోజుల ముందు దర్శకుడు మారడంతో, తన పాత్రకు బదులుగా నగ్మాను తీసుకున్నారని ఆమని గుర్తు చేసుకున్నారు. అది తమకు నిజంగానే కష్టమైందని అన్నారు. ఆ తర్వాత స్టాలిన్ సినిమాలో చిరంజీవి సోదరి పాత్ర (ఖుష్బూ పోషించినది) కోసం మురుగదాస్ గారు తనను చాలా ఫోర్స్ చేశారని, డబ్బులు కూడా ఎంతైనా ఇస్తామని చెప్పినప్పటికీ, తాను చిరంజీవికి వీరాభిమానిని కాబట్టి, పక్కన హీరోయిన్గా చేయాలనుకున్నాను కానీ సోదరిగా చేయనని చెప్పి ఆ పాత్రను తిరస్కరించినట్లు ఆమని వెల్లడించారు. వెంకటేశ్‌తో కలిసి ఎక్కువగా నటించలేకపోవడం పట్ల కొంత విచారం వ్యక్తం చేశారు. సౌందర్య, వెంకటేశ్ కాంబినేషన్ చాలా సక్సెస్ అయిందని, బహుశా అందుకే తనకు ఎక్కువ అవకాశాలు రాలేదేమో అని అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
ఆమని తన కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన పాత్రలలో ఒకటిగా అక్కినేని అఖిల్ బాలనటుడిగా నటించిన సీసీంద్రి చిత్రంలోని మాతృ పాత్రను పేర్కొన్నారు. అఖిల్ అప్పుడు 7-9 నెలల పసికందు అని, అతని వన్ ఇయర్ బర్త్‌డేకి సినిమా పూర్తయిందని తెలిపారు. చిన్నారి అఖిల్‌తో షూటింగ్ చాలా సవాలుగా ఉండేదని, అతను మూడ్‌లో ఉన్నప్పుడే షాట్స్ తీయాల్సి వచ్చేదని, అఖిల్ నిద్రపోతే యూనిట్ మొత్తం నిద్రపోయేదని, అతను లేస్తేనే షూటింగ్ మొదలయ్యేదని గుర్తుచేసుకున్నారు. అక్కినేని అమల సెట్లో ఉండి, అఖిల్ ఏడ్చినప్పుడు కెమెరా పక్కన నిలబడి నవ్వించేవారని, ఆ స్మైల్స్ చాలా క్యూట్‌గా ఉండేవని వివరించారు. ఈ సినిమా సమయంలోనే అమల గారు “మా బాబుకి మంచి మదర్ దొరికారు, చాలా సహనంతో చేశారు” అని ప్రశంసించారని ఆమని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..