Headlines

Aadhaar Card: మీ ఆధార్‌లో ఏయే వివరాలు అప్డేట్ చేశారో మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. సెకన్లలోనే తెలుసుకోండిలా..


ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వినియోగదారులు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మొబైల్ నెంబర్, అడ్రస్, పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, ఈమెయిల్, బయోమెట్రిక్ వివరాలు లాంటివి మార్చుకుంటూ ఉంటారు. వివరాలు అప్డేట్ అయ్యాక ఆ వివరాలతో కొత్త ఆధార్ మీకు యూఐడీఏఐ జారీ చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఏయే వివరాలు అప్డేట్ చేసుకున్నారనే విషయాలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆ వివరాలను డౌన్ లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు యూఐడీఏఐ కల్పిస్తోంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం.

మీ ఆధార్ కార్డుకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని యూఐడీఏఐ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆధార్ ద్వారా మీరు చేసే ప్రతీ పని రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలతో పాటు ఇప్పటివరకు ఏయే వివరాలు అప్డేట్ చేశారనే హిస్టరీ తెలుసుకోవచ్చు. చాలామంది వివరాలను అప్డేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు అప్డేట్ చేసుకున్నామనేది మర్చిపోతారు. దీని వల్ల ఆధార్ అప్డేట్ హిస్టరీని తెలుసుకోనే అవకాశం కల్పిస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్, పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇలా ఏది అప్డేట్ చేసుకున్నాక కూడా తెలుసుకోవచ్చన్నమాట.

ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకోవడం ఎలా..?

-https://uidai.gov.in/en పోర్టల్‌లోకి వెళ్లాలి

ఇవి కూడా చదవండి



-ఆ తర్వాత మై ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-అనంతరం అప్డేట్ మై ఆధార్ కేటగిరీలోకి వెళ్లాలి

-అందులో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి

-అక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ అనే ఆప్షన్లు ఉంటాయి

-ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ నమోదు చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-అనంతరం సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి

-అనంతరం మీకు స్క్రీన్‌పై ఆధార్ అప్డేట్ హిస్టరీ కనిపిస్తుంది

-ఏ తేదీ, ఏ సమయంలో అప్డేట్ చేశారనే వివరాలతో పాటు ఏ వివరాలు అప్డేట్ చేశారు, అప్డేట్ స్టేటస్ ఏంటి అనేవి కనిపిస్తాయి.

-మీకు అవసరమైతే పీడీఎఫ్ రూపంలో ఈ వివరాలను అక్కడే డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు చెక్ చేసుకోవాలి..?

మీరు అప్డేట్ చేసిన వివరాలు విజయంతంగా ప్రాసెస్ అయ్యాయా.. లేదా అనేది తెలుస్తుంది. అలాగే ఆధార్ డేటాలో అక్షర దోషాలు, తప్పుడు సమాచారం వంటివి గుర్తించవచ్చు. అలాగే గత అప్డేట్‌లను గుర్తించుకోవడానికి సహాయపడుతుంది. మీకు తెలియకుండా ఏమైనా మార్పులు చేసి ఉంటే పసిగట్టవచ్చు. క్రమం తప్పకుండా మీరు చెక్ చేసుకోవడం వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *