Headlines

పాన్ ఇండియా రేసులో మారిన స్టార్ హీరోల రూట్


ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, మనసుకి హత్తుకునే లవ్ స్టోరీస్. స్టార్ హీరోలంతా ఇలాంటి మామూలు కథలతోనే ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక టాలీవుడ్ సీన్ మారిపోయింది. బాహుబలితో ప్రభాస్ సెట్ చేసిన లార్జర్ ద్యాన్ లైఫ్ టెంప్లేట్ ఇండస్ట్రీ గేర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పుడు మన టాప్ స్టార్స్ అందరిదీ ఇదే రూట్. అల వైకుంఠపురంలో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆ తర్వాత తన స్టైల్ ను పూర్తిగా మార్చేశారు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన బన్నీ ఇప్పుడు పూర్తిగా భారీ స్కేల్ ప్రాజెక్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ కూడా పాన్ ఇండియా ట్రెండ్ తర్వాత టోటల్ గా టర్న్ తీసుకుంది. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న తారక్ ఆ తర్వాత దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అంటూ వరుసగా హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలే లైన్ లో పెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్, పెద్ది, ఆపై సుకుమార్ తో ఆర్సీ 17.. ఇలా అన్నీ భారీ స్పాన్ ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్టులే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవంబర్ సెంటిమెంట్ బ్రేక్… కాసులు కురిపిస్తున్న కంటెంట్‌

Dhanush: నాలుగోసారి అదే కాంబో.. బాలీవుడ్‌లో ధనుష్ భారీ ప్లాన్!

స్టార్ హీరోలకు ఇమేజ్ ట్రాప్… ఆ ముగ్గురిదీ ఒకటే ప్రాబ్లమ్!

లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు దూరమవుతున్న స్టార్ హీరోలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *