Headlines

లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు దూరమవుతున్న స్టార్ హీరోలు


గ్లోబల్ మార్కెట్ రేసులో తెలుగు స్టార్ హీరోలు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు దూరమవుతున్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్రమాణాలను అందుకునే ప్రయత్నంలో, ఒకప్పుడు మన హీరోల బలం అయిన సింపుల్ కథలు, వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రమంగా కనుమరుగవుతున్నాయి. మారిన మార్కెట్ ఈక్వేషన్సే ఈ పరిణామానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రతి సినిమాకు వందల కోట్ల బడ్జెట్, రెండు మూడేళ్ల షూటింగ్ సమయం అవసరమైనప్పుడు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి అది ఒక ఈవెంట్ ఫిల్మ్ అయి ఉండాలనే ఆలోచన బలపడుతోంది. సింపుల్ ఫ్యామిలీ డ్రామాలు లేదా లవ్ స్టోరీస్ పాన్ ఇండియా మార్కెట్లో వర్కవుట్ కావన్న భయం మేకర్స్‌లో కనిపిస్తోంది. దీంతో స్టార్స్ అంతా భారీ యాక్షన్, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్స్, VFX ఫాంటసీ కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో సైతం “గుంటూరు కారం” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వారణాసి” కోసం తన కెరీర్‌లో కీలక సమయాన్ని కేటాయించారు. ఇది ఆయన నుంచి వింటేజ్ కామెడీ, కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను మిస్ అయ్యేలా చేస్తోంది. భారీ ప్రాజెక్టుల మధ్యలోనైనా స్టార్ హీరోలు పాత జానర్‌లను స్పృశించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad Fish Markets: బీ అలర్ట్! హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లలో కుళ్లిన చేపల అమ్మకం

Shah Rukh Khan: అనంత్ అంబానీ వీడియోపై షారుఖ్ సీరియస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు లీగల్ నోటీస్

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ

Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *