Headlines

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1156 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం


అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 1156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB AP) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 నవంబరు 27 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబరు 16, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఎస్‌సీటీ కానిస్టేబుల్ (సివిల్) పోస్టుల సంఖ్య: 542
  • ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 285
  • ఫైర్‌మెన్ పోస్టుల సంఖ్య: 158
  • వార్డర్లు (పురుషులు) పోస్టుల సంఖ్య: 150
  • వార్డర్లు (మహిళలు) పోస్టుల సంఖ్య: 21

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రత్యేక విద్యార్హత నిబంధనలు వర్తిస్తాయి. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన వయోపరిమితి, శారీరక ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయస్సు, ఎత్తు, ఇతర శారీరక అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, నాన్-లోకల్ అభ్యర్థులు రూ.300, ఏపీ స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షను 2027 జనవరి 31న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎంపిక విధానం

  • అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది.
  • ప్రాథమిక రాత పరీక్ష (Preliminary Written Test)
  • దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష (PMT)
  • శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  • తుది రాత పరీక్ష (Final Written Examination)

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రెండు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

ఇవి కూడా చదవండి



  • స్టేజ్-1: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • స్టేజ్-2: ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
  • వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒకే దరఖాస్తు ఫారమ్ సరిపోతుందని నియామక మండలి స్పష్టం చేసింది.
  • బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 01-04-2026 తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీ లేయర్ (NCL), ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 27 నవంబరు 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 16 డిసెంబరు 2026
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: 31 జనవరి 2027

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర వివరాలను తెలుసుకోవడానికి ఏపీ పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మొత్తం 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *