Headlines

పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక


నెట్‌ఫ్లిక్స్ తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్ జో బచాయ్ హై సంగ్ సమైట్ లో చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. డిసెంబర్ 4న స్ట్రీమింగ్ కు రానున్న ఈ సిరీస్ ను ఇండియాలో రిలీజ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టులకు సహకరించబోమని, అన్ని షూటింగ్‌లను నిలిపివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ ఎంప్లాయీస్ యూనియన్ (FWICE) గట్టిగా హెచ్చరించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, సనమ్ సయీద్, హని అమీర్ వంటి ప్రముఖ పాకిస్థానీ నటులు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన వెంటనే భారతదేశంలోని సినీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సిరీస్ ను ఇండియాలో స్ట్రీమింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టులు, షూటింగ్‌లు ఆగిపోయేలా చూస్తామని FWICE అధ్యక్షుడు B.N. తివారీ స్పష్టం చేశారు. తమకు దేశమే ప్రధమమని, పాకిస్థానీ కళాకారుల కంటెంట్‌కు తాము వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ తమ ఆదేశాలను పాటించకపోతే, అన్ని నెట్‌ఫ్లిక్స్ నిర్మాణాల నుంచి తమ సభ్యులను ఉపసంహరించుకుంటామని, దాని లొకేషన్లలో షూటింగ్‌లను నిలిపివేస్తామని FWICE హెచ్చరించింది. గత సంవత్సరం భారత ప్రభుత్వం అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు పాకిస్థానీ కంటెంట్‌ను ప్రదర్శించవద్దని ఆదేశించిందని, భారతదేశ విధానాలకు లేదా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను ప్రదర్శించబోమని నెట్‌ఫ్లిక్స్ కూడా అంగీకరించిందని FWICE పేర్కొంది. అయినప్పటికీ, ఇప్పుడు ఒక పాకిస్థానీ సిరీస్ ప్రోమోను విడుదల చేయడాన్ని వారందరూ తప్పుబడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలియాస్ రుక్మిణీ ట్రైలర్.. నితిన్‌ను గట్టెక్కిస్తుందా..?

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!

ధురంధర్ బ్యూటీకి ఇన్నాళ్లకు మంచి ఆఫర్ వచ్చిందా..?

కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్‌ విషయాలు చెప్పిన అక్షయ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *