Headlines

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాండ్ మార్చుకున్న స్టాలిన్ పార్టీ!


డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాండ్ మార్చుకున్న స్టాలిన్ పార్టీ!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచేందుకు బిల్లులో అవకాశం కల్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే ఎంపీ ఏ. రాజా వెల్లడించారు. తమ పార్టీ మొదటి నుంచీ న్యాయబద్ధమైన నియోజకవర్గాల పునర్విభజనకే మద్దతు ఇస్తోందని, ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉన్నామని తెలిపారు. శనివారం పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

అయితే, డీఎంకే తాజా నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ.. 2025లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి, లోక్‌సభ స్థానాల సంఖ్యపై ఉన్న స్తంభనను 2026 తర్వాత మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ కనిమొళి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానాల సంఖ్య 816కు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదనతో ఇప్పుడు డీఎంకే తన వైఖరిని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *