పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ వరుస సినిమాలతో సత్తా చాటింది. ఆమె మరెవరో కాదు.. దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె స్టార్డమ్, ఆకర్షణ ఎప్పటికీ చెక్కుచెదరనిది. ఆమె నటించిన బాహుబలి సిరీస్‌లోని రెండు చిత్రాలు కలిపి రూ. 2500 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను సాధించి భారత సినిమా చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పాయి. కొంతకాలం పాటు సినిమాలు విడుదల కాకపోయినా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరోయిన్ ఆమెనే.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
సినిమాల్లోకి రాకముందు యోగా శిక్షకురాలిగా పనిచేసిన అనుష్క, 2005లో సూపర్ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, వేదం, మిర్చి, రుద్రమదేవి, భాగమతి వంటి వైవిధ్యమైన చిత్రాలతో నటిగా తన సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సోలోగానూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకోగలనని నిరూపించారు. పాత్రల ఎంపికలో ఎప్పుడూ తొందరపడకుండా, కథకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం అనుష్క అటు సినిమాలకు.. ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
నివేదికల ప్రకారం అనుష్క శెట్టి నికర ఆస్తి సుమారు రూ. 133 కోట్లుగా అంచనా. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె భారీగా సంపాదిస్తున్నారు. ఒక సినిమాకు సుమారు రూ. 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. అలాగే ఆమె వద్ద బీఎండబ్ల్యూ 6 సిరీస్, ఆడి క్యూ5, ఆడి క్యూ6, టయోటా కొరోలా ఆల్టిస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. నవ్వు మొదలైతే ఆపుకోవడం కష్టమని, కామెడీ సన్నివేశాల సమయంలో షూటింగ్లలో అనేకసార్లు నవ్వు ఆపుకోలేకపోయేదానినని ఆమె పంచుకున్న సరదా విషయాలు అభిమానులను అలరిస్తుంటాయి.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
అనుష్క శెట్టి..

Anushka Shetty News
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..