Headlines

ముందుకెళ్లలేక.. వెనక్కి రాలేక.. ఇరుకైన గుహలో మహిళ అవస్థలు!


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పర్యాటక ప్రదేశాల్లో భద్రత, అప్రమత్తతపై కొత్త చర్చకు దారితీసింది. అత్యంత ఇరుకైన, చీకటి గుహలోని ఇరుకైన దారిలో ఓ మహిళ చిక్కుకుపోయిన దృశ్యాలు చూపరులను ఆందోళనకు గురిచేశాయి.

వీడియోలో ఏం కనిపించింది?

గాలి కూడా సరిగ్గా ఆడని ఇరుకైన గుహలో చిక్కుకున్న మహిళ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఇబ్బంది పడుతూ కనిపించారు. భయంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె ఏడుస్తూ సాయం కోసం అరిచిన తీరు వీడియోలో రికార్డైంది. ఆమె పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి చేతిలో టార్చ్‌తో అక్కడికి చేరుకుని ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. మహిళకు కొంత ఊరట కలగడానికి ఆమె వద్ద ఉన్న బరువైన బ్యాగ్‌ను తాను తీసుకున్నారు. బయట టికెట్ కౌంటర్ వద్ద ఉన్నవారిని వెంటనే సాయం కోసం పిలుస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు

ఇవి కూడా చదవండి



భద్రతపై నెటిజన్ల స్పందనలు

ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా ముందుగానే ప్రమాద తీవ్రతను అంచనా వేసుకోవాలని మరికొందరు సూచించారు. సమయానికి బయటకు తీయకపోతే పరిస్థితి మరింత విషమించేదని కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు, కెమెరా కోణాల వల్లే ఇరుకుగా కనిపిస్తోందేమోనని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

పర్యటనలు, సాహసాల పేరుతో ఇరుకైనదారులు, ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, భద్రతా నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *