Headlines

ఈ సినిమాలో సస్పెన్స్ ఉంటది భయ్యా.. ఏడాదిగా ఓటీటీని షేక్ చేస్తున్న మూవీ.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్..


సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథాంశాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ప్రముఖ డిజిటల్ వేదిక సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కుట్రం పురింధవన్: ది గిల్టీ వన్ (Kuttram Purindhavan: The Guilty One) ఒక గ్రిప్పింగ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. మొత్తం 7 ఎపిసోడ్లతో రూపొందిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఐఎండీబీ (IMDb)లో 7.7 రేటింగ్ దక్కించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండటంతో విభిన్న భాషల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. నిజానికి గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు మాత్రం ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. మరోసారి ఈ మూవీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ సినిమా పేరు తెగ వినిపిస్తుంది. ఇంతకీ ఈ మూవీ కథేంటో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో వేసిన అడుగు, చివరికి కుటుంబాన్ని పెద్ద ప్రమాదంలోకి నెడితే ఎలా ఉంటుంది? ఆ సంక్షోభం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్య వ్యక్తి ఏం చేస్తాడనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. ఒక గ్రామంలో జరిగే జాతర రాత్రి ఒక వ్యక్తి తన ఇంటి బయట హత్యకు గురవుతాడు. అదే సమయంలో అతని చిన్నారి కూతురు మెర్సీ అదృశ్యమవుతుంది. ఈ ఘటనతో మెర్సీ తల్లి ఎస్తేర్ (లక్ష్మీ ప్రియా చంద్రమౌళి) తీవ్ర ఆవేదనలో మునిగిపోతుంది. ఇదే క్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఫార్మసిస్ట్ భాస్కరన్ (పశుపతి) తన మనవడి అత్యవసర సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకునే పోరాటంలో ఉంటాడు. గాయపడిన చిన్నారి మెర్సీ సాయం కోరి భాస్కరన్ వద్దకు రావడం, ఆమెకు సహాయం చేయబోయి అతను ఊహించని చిక్కుల్లో పడటం కథను మలుపు తిప్పుతుంది. పోలీస్ కానిస్టేబుల్ గౌతమ్ (విదార్థ్) దర్యాప్తు వేగవంతమవుతున్న కొద్దీ నిజాన్ని దాచిపెట్టేందుకు భాస్కరన్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠను పెంచుతాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

సెల్వమణి మునియప్పన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు విలక్షణ నటుడు పశుపతి నటన ప్రధాన బలంగా నిలిచింది. పరిస్థితుల ప్రభావంతో తప్పుదారి పట్టాల్సి వచ్చిన సామాన్య మధ్యతరగతి వ్యక్తిలోని భయం, ఆందోళన, పశ్చాత్తాపాన్ని ఆయన సహజంగా పలికించారు. హత్య ఎవరు చేశారనే దానికంటే, నిజం బయటకు రాకుండా దాచే ప్రయత్నంలో ఒక కుటుంబ పెద్ద పడే తపనను భావోద్వేగభరితంగా చూపించారు. తొలి రెండు ఎపిసోడ్లు పాత్రలు, గ్రామ వాతావరణాన్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా సాగినా, మూడో ఎపిసోడ్ నుంచి గౌతమ్ అనుమానం భాస్కరన్ వైపు మళ్లిన తర్వాత కథనం వేగం పుంజుకుని చివరి వరకు కట్టిపడేస్తుంది. భావోద్వేగభరిత క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *