వేరు భాగం చివరి వరకు : చాలా మంది ఉల్లిపాయను కట్ చేసే టప్పడు చాలా మంది కొన్ని చిన్న తప్పులు చేస్తారు. ఉల్లిపాయలో వేరు ఉండే భాగంలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసినప్పుడు వేరు భాగాన్ని తొలగించకుండా అలాగే ఉంచి, పైభాగం నుంచి తరగడం ప్రారంభించడం మంచిది. ఇలా చేస్తే కళ్లలో మంట ఏర్పడటాన్ని చాలావరకు తగ్గించవచ్చు.
వేరు భాగాన్ని పట్టుకుని: మీరు సగానికి కోసిన ఉల్లిపాయ వేరు భాగాన్ని వేళ్లతో పట్టుకుని, వేరు వరకు పూర్తిగా కోయకుండా తరిగినప్పుడు సల్ఫర్ బయటకు వ్యాపించడం తగ్గుతుంది. చివరగా వేరు ఉన్న చిన్న భాగాన్ని మాత్రమే వేరు చేసి తరుగుకోవచ్చు. ఉల్లిపాయ అంచులను సరిగ్గా పట్టుకుని తరగడం వల్ల ముక్కలు ఒకే పరిమాణంలో వేగంగా వస్తాయి.
ఉల్లిపాయలు తరగడాని మనం ఏ కత్తి వాడుతున్నామనేది కూడా ముఖ్యం. పదును తగ్గిన కత్తిని ఉపయోగిస్తే ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగిపోయి రసం ఎక్కువగా బయటకు వస్తుంది. కాబట్టి మంచి పదును ఉన్న కత్తిని వాడడం మంచిది.
అయితే మీకు కళ్లలో నీళ్లు రాకుండా ఉండాలంటే కోసే ముందు ఉల్లిపాయలను నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల రసం గాలిలో వ్యాపించే వేగం తగ్గుతుంది. దీనివల్ల కళ్ల మంటను నివారించవచ్చు.
అలాగే ఉల్లిపాయలు కోటేటప్పుడు వంటగదిలో ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఆన్ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ నుంచి వచ్చే రసం కళ్ల వైపు కాకుండా పక్కకు వెళ్తుంది. ఈ చిట్కాలను పాటిస్తూ ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు రాకుండా ఉండటమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఈ సారి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ పద్ధతులను తప్పకుండా ప్రయత్నించి చూడండి.




