Headlines

Folk Song: కుర్రాళ్లు ఈ పాట పాడితే ఏ అమ్మయి అయినా పడిపోవాల్సిందే.. ఒక్కసారి వింటే వదిలిపెట్టరు


సోషల్ మీడియాను ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసిన  ఆవే  పాటలు వినిపిస్తున్నాయి. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు ఇప్పుడు సినిమాల్లోనూ ఫోక్ సాంగ్స్ సందడి చేస్తున్నాయి. మాస్ బీట్స్ తో తెరకెక్కుతున్న పల్లె పాటలకు రోజు రోజుకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఆత్మీయతలు, అందచందాలను వర్ణిస్తూ తెరకెక్కుతున్న పాటలు ఎంతో మందిని అలరిస్తుంటాయి. అసలు ఆ పాటలు వింటుంటే పల్లె వాతావరణం కళ్ళముందు అలా కనిపిస్తుంది. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సాంగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే పాటను పదే పదే వింటున్నారు ఆడియన్స్. మనం మాట్లాడుకుంటున్న ఆ సాంగ్ పేరు “అబ్బబ్బగా పోరి”. ఈ పాట డీజేలలో మోత మోగిపోతుందనే చెప్పాలి. జోగుల వెంకటేష్ పాడిన ఈ పాట పల్లెటూరి యువతి అందాన్ని, ఆమె నడక తీరును, అలంకారాన్ని కుర్రాళ్లు పొగుడుతూ పాడే ఈ పాట వింటుంటే భలే అనిపిస్తుంది.

కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. అందాల ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి నటించిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  తమ నటనతో, ఆకట్టుకునే డ్యాన్స్ మూవ్స్‌తో పాటను మరింత రక్తికట్టించారు ఈ ఇద్దరూ. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే నాటు పదాలు, అందమైన యాస ఈ పాటకు ప్రధాన బలం. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 90 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాట డీజేలలో మారుమోగుతుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *