Headlines

టికెట్‌లో బెర్త్ కన్ఫామ్.. తీరా రైలెక్కితే సీటే లేదు.. ప్రయాణికుడికి వింత అనుభవం


టికెట్‌లో బెర్త్ కన్ఫామ్.. తీరా రైలెక్కితే సీటే లేదు.. ప్రయాణికుడికి వింత అనుభవం

ఒక రైల్వే ప్యాసింజర్‌కు ఎదురైన చేదు సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇషాన్ బాజ్‌పాయ్ అనే వ్యక్తి వారణాసి నుండి నేపాల్‌గంజ్ రోడ్‌కు వెళ్లేందుకు రైలు 15132 (BCY NPR ఎక్స్‌ప్రెస్)లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అతడికి బుకింగ్ స్టేటస్ CNF/A1/54/SU అని మెస్సేజ్ వచ్చింది. ఇది A1 కోచ్‌లో 54వ బెర్త్ నంబర్‌గా చెప్పవచ్చు. అయితే ఆ కోచ్‌లో కేవలం 52 బెర్త్‌లు మాత్రమే ఉండగా.. 54వ సీటు నెంబర్ రావడంతో అతడు దీనిని ప్రశ్నిస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందని రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించిన అతడు.. అర్ధరాత్రి ప్రయాణంలో సీటు దొరక్క ఇరుక్కుపోతానేమోనని ఈ పరిస్థితి తనను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నాడు.

“ఈ రాత్రి 15132 నంబర్ రైలులో ప్రయాణిస్తున్నాను. నా టిక్కెట్టుపై A1/54 సీటు ఖరారైంది. కానీ ఆ కోచ్‌లో 52 బెర్త్‌లు మాత్రమే ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణంలో రాత్రి 10:45 గంటలకు సీటు లేకుండా పోవడం చాలా నిరాశ కలిగించింది. 139 నంబర్‌కు ఫిర్యాదు చేశాను. ఇది ఎలా జరగగలదు?” అంటూ ప్రశ్నించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వేశాఖ స్పందించింది. అతని పోస్ట్ త్వరగానే తమ దృష్టికి వచ్చిందని, అవసరమైన చర్యల కోసం ఈ విషయాన్ని సంబంధిత అధికారిదృష్టికి పంపించామని సమాధానమిచ్చింది. మీకు ఎదురైన అనుభవానికి తాము చింతిస్తున్నామని, తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగా దయచేసి మీ మొబైల్ నంబర్‌ను వీలైతే DM ద్వారా పంచుకోండి అంటూ అతడిని కోరింది. రైలులో ఎదురయ్యే సమస్యలను railmadad.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, తక్షణ సహాయం పొందేందుకు 139 నెంబర్‌కు కాల్ చేయవచ్చని రైల్వేశాఖ పేర్కొంది

అయితే ఈ అంశంపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఇలాంటి ఇబ్బందికరమైన సంఘటనలను ఎదుర్కొంటున్నారని, అధికారులు విచారణ జరపాలని కోరారు. ఈ సంఘటనలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయని, రైల్వే దీనిని పరిష్కరించాలిని అంటున్నారు. “ఈ రోజుల్లో రైల్వేలలో ఇలా చాలా జరుగుతోందని, తనర 2AC ఆటోమేటిక్‌గా 3ACగా మారిపోయింది. రీఫండ్ ప్రక్రియ చాలా శ్రమతో కూడకున్నది. దీంతో రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం మానుకోవలసి వచ్చింది. సేవలు పూర్తిగా దారుణంగా తయారయ్యాయి” అని ఒక వ్యక్తి తనకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నాడు. రైల్వే శాఖ పూర్తిగా గందరగోళంలో ఉందని, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని మరో యూజర్ డిమాండ్ చేశాడు. ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణికులు రాత్రి సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *