Headlines

మెగా ఎల్‌నినో ప్రభావంతో కరువు కాటకాలు తప్పవా ?


ప్రపంచం మరోసారి ప్రకృతి ప్రకోపానికి వణికిపోనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలోని పెరూ తీరం, గాలపాగోస్ దీవుల సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని సైంటిస్టులు “మెగా ఎల్‌నినో”గా అభివర్ణిస్తున్నారు. గతంలో మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వడగాలులు, కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు కొన్నిచోట్ల 10 డిగ్రీలకు చేరడం పెను సవాలుగా మారింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఇది చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎల్‌నినోలలో ఒకటిగా నిలిచిపోతుందని అంచనా వేసింది. డిసెంబర్ నుంచి దీని విధ్వంసకర ప్రభావం మొదలై 2027 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కరువులు, వరదలు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *