కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పొట్టు మినప్పప్పు, ఒకటిన్నర తెల్ల జొన్న రవ్వ , ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్
అల్లం, 2 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు ఆకులు, ఒక ఉల్లిపాయ 1 పెద్దది, ఇంకా తగినంత నూనెను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పొట్టు మినప్పప్పును తీసుకోండి. పొట్టు మినప్పప్పు లేనివారు గుండు మినపప్పును కూడా వాడుకోవచ్చు. ఈ పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. పప్పు చక్కగా నానడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. ఆరు గంటల తర్వాత నానిన మినప్పప్పును మిక్సీ జార్లో గానీ లేదా గ్రైండర్లో గానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.