Headlines

OTT Movie: 77 హత్యలు.. ఆడవాళ్లను చంపి తాళి బొట్లు తీసుకెళ్లే సైకో.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..


సాధారణంగా సైకో కిల్లర్ లేదా సీరియల్ కిల్లర్ చేసే ఆగడాల వెనక ఓ బలమైన మోటివ్ ఉంటుంది. మన సినిమాల్లోనూ ఇదే చూస్తుంటాం. వరుసగా హత్యలు జరగడం, హీరో ఆ కిల్లర్ ను వెతికి పట్టుకోవడం, విచారణలో ఆ కిల్లర్ కు ఓ విషాదకరమైన ప్లాష్ బ్యాక్ ఉండడం.. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ దాదాపు ఈ టెంపోలోనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. 1999లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. తిరువళ్లూరుకు దగ్గర్లో ఉన్న పొడతూర్‌‌పేట అనే ప్రాంతంలో 1995లో వరుసగా ఒకే ప్యాట్రన్ లో వరుస హత్యలు జరుగుతాయి. అయితే అవి దోపిడీ కోసం చేసిన హత్యలు కాదు. ఒంటరిగా ఉండే భార్య, భర్తలను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటాడు కిల్లర్.‌‌‌ వారిని హత్య చేసి మగవారి నడుము గొలుసు (మొలతాడు), ఆడవారి మంగళసూత్రం మాత్రమే తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఘటనా స్థలంలో రక్తంతో ‘‘?’’(ప్రశ్నార్థకం గుర్తు) రాసి పోలీసులకు సవాల్ విసురుతాడు. దీంతో ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు సీనియర్ పోలీసాఫీసర్స్ రంగంలోకి దిగుతారు. విచారణలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. సీరియల్ కిల్లర్స్ ఒకట కాదు రెండు కాదు మొత్తం 77 హత్యలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్స్ ఎవరు? అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు వారిని పట్టుకున్నారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ సిరీస్ చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ పేరు ‘తడయం’. ఓటీటీలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఇది ఒకటని చెప్పవచ్చు. నవీన్ కుమార్ పళనివేల్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.శివదా, సుందర్ పాండియన్, రాజ్ తిరందాస్, మున్నార్ రమేశ్ ఇతర పాత్రల్లో మెరిశారు. అజయ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే తడయం వెబ్ సిరీస్ మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

తడయం వెబ్ సిరీస్ ట్రైలర్..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *