కావాల్సిన పదార్థాలు : పేపర్ అటుకులు: 1/2 కిలో, వేరుశనగలు: 100 గ్రాములు, పుట్నాల పప్పు: 100 గ్రాములు, జీడిపప్పు: 1/4 కప్పు, కిస్మిస్లు: 1/4 కప్పు, నూనె: 1 కప్పు, ధనియాలు (కచ్చాపచ్చాగా దంచినవి): 1 టేబుల్‌స్పూన్, ఆవాలు: 1 టీస్పూన్, వెల్లుల్లి : 1 టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి : 7-8, కరివేపాకు: కొద్దిగా, నువ్వులు: 2 టీస్పూన్లు, పసుపు: 1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, చక్కెర పొడి: 2 టీస్పూన్లు
ముందుగా, కిలో పేపర్ అటుకులను తీసుకొని, వాటిని జల్లెడలో జల్లించాలి. దీనివల్ల అటుకుల్లో ఉండే చిన్న చిన్న రేణువులు వేరవుతాయి.తర్వాత జల్లించిన అటుకులను ఒక పెద్ద మందపాటి కడాయిలోకి తీసుకొని, స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. అటుకులు మాడిపోకుండా, కరకరలాడే వరకు సుమారు 5-7 నిమిషాలు వేయించి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.తర్వాత అదే కడాయిలో 1 కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, 100 గ్రాముల వేరుశనగలు వేసి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించి తీసి అటుకుల్లో కలపాలి.
తర్వాత, 100 గ్రాముల పుట్నాల పప్పును కూడా దోరగా వేయించి తీసి అటుకుల్లో కలపాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. అలాగే, 1/4 కప్పు జీడిపప్పును వేయించి, బంగారు రంగు వచ్చాక తీసి అటుకుల్లో కలపాలి. చివరగా, 1/4 కప్పు కిస్మిస్లను వేసి, అవి ఉబ్బి బబుల్స్ లా మారే వరకు వేయించి తీసి అటుకుల్లో కలపాలి. కావాలంటే, ఈ దశలో సన్నగా తరిగిన ఎండుకొబ్బరిని కూడా వేయించి కలుపుకోవచ్చు.
ఇప్పుడు పోపు తయారు చేసుకోవాలి. దీని కోసం మరో పాన్ తీసుకొని అందులో నూనె వేయాలి. అందులో 1 టేబుల్‌స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్‌స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక, 8 కట్ చేసిన పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. పచ్చిమిర్చిలు క్రిస్పీగా మారాలి. తరువాత, కొద్దిగా కరివేపాకును వేసి అది కూడా క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. చివరగా, 2 టీస్పూన్ల నువ్వులను వేసి చిటపటమనకుండా వేయించి, స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు 1/2 టీస్పూన్ పసుపును కలిపి, ఈ వేడి పోపును వేయించిన అటుకుల మిశ్రమంలో కలపాలి.
తర్వాత వీటిని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే రుచి అంత బాగా ఉంటుంది. దీని కోసం అటుకుల మిశ్రమంలో పోపు వేసిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల చక్కెర పొడిని కలపాలి. చక్కెర పొడి చేర్చడం వల్ల రుచి సమతుల్యంగా ఉంటుంది అటుకులు విరిగిపోకుండా, చేతులతో సున్నితంగా కలపాలి లేదా గిన్నెను పైకి ఎగురవేస్తూ టాస్ చేయాలి. గరిటెతో కలిపితే అటుకులు విరిగే అవకాశం ఉంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే కొద్దిగా చేర్చి కలపవచ్చు. అంతే అటుకులు రెడీ




