Headlines

రోడ్డుపై ఈ రంగుల నెంబర్ ప్లేట్లు చూశారా..? ప్రతీ రంగుకు ఒక్కొ అర్ధం.. ఏంటంటే..?


భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్లు కేవలం నమోదు సంఖ్యలు మాత్రమే కావు. వాటి రంగులు, వాటిపై ఉన్న అక్షరాల రంగులను బట్టి అవి ఎలాంటి వాహనాలో, వాటి వినియోగం ఏమిటో ఎవరైనా సులువుగా  తెలుసుకోవచ్చు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం అనేది తప్పనిసరిగా ఉంటుంది.  భారతదేశంలోని వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నిబంధనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా కనిపించే నంబర్ ప్లేట్లలో వైట్ ప్లేట్ మీద బ్లాక్ కలర్ టెక్స్ట్ ఉంటే అది పర్సనల్ లేదా ప్రైవేట్ వెహికల్ అని అర్థం. మనం నిత్యం ఉపయోగించే కార్లు, బైకులు ఈ కోవలోకి వస్తాయి. అదే ఎల్లో ప్లేట్ మీద బ్లాక్ కలర్ టెక్స్ట్ ఉంటే అది కమర్షియల్ వెహికల్‌గా చెబుతారు.

క్యాబ్‌లు, లారీలు, బస్సులు, టాటా ఏస్ వంటి కమర్షియల్ వాహనాలు ఎల్లో రంగు నెంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి. ఈ వాహనాలను కేవలం వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారు. ఇక గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ మీద వైట్ కలర్ టెక్స్ట్ ఉంటే అది పర్సనల్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అని అర్ధం. అంటే EV బైకులు లేదా EV కార్లు వంటి వ్యక్తిగత EV వాహనాలకు ఈ రకమైన ప్లేట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఈ నెంబర్ ప్లేట్లను వినియోగిస్తారని చెప్పవచ్చు. అదే గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ మీద ఎల్లో కలర్ టెక్స్ట్ ఉంటే అది కమర్షియల్ EV వెహికల్ అని అర్ధం. అంటే EV ఆటోలు, EV క్యాబ్‌లు, EV బస్సులు వంటి వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నెంబర్లను ప్లేట్లను కేటాయిస్తారు.

చివరగా బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ మీద ఎల్లో కలర్ టెక్స్ట్ ఉంటే అది సెల్ప్ డ్రైవ్ రెంటల్ వెహికల్‌గా చెప్పవచ్చు. మీరు అద్దెకు తీసుకునే కార్లు ఈ రంగు నంబర్ ప్లేట్‌లను ఎక్కువగా కలిగి ఉంటాయి.  దీనిని మీరు గమనించి ఉండవచ్చు. ఈ నంబర్ ప్లేట్ల రకాలను అర్థం చేసుకోవడం ద్వారా వాహనాల వర్గీకరణ, వాటి నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఇలా వాహనం ఉపయోగాన్ని బట్టి నెంబర్ ప్లేట్ల రంగులను కేటాయించారు. ఆ వాహనం ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నామనే విషయాలతో పాటు ఆ వాహనం కేటగిరీని ఇది తెలియచేస్తుంది. అందుకే వాహన రకం, దాని ఉపయోగాన్ని గుర్తించేందుకు నెంబర్ల పేట్లలను వివిధ రంగుల్లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో దాదాపు అన్ని వాహనాలకు ఇవే రంగుల నెంబర్ ప్లేట్లు కలిగి ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *