Headlines

బస్టాండ్‌లో కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యం


నిత్యం బస్సుల రాకపోకలు, ప్రయాణికుల హడావుడి, వాహనాల రణగొణ ధ్వనులతో కళకళలాడే మహబూబ్ నగర్ బస్ స్టాండ్ సాయంత్రం వేళ మాత్రం అరుదైన, అందమైన ప్రకృతి దృశ్యానికి వేదికగా మారుతోంది. సూర్యుడు అస్తమించే సమయానికి, వందలాది రామచిలుకలు గుంపులు గుంపులుగా బస్ స్టాండ్ ఆవరణలోని భారీ వృక్షాలపై వాలుతాయి. పచ్చని చెట్లపై వాలే పచ్చని చిలుకల కొలువు, వాటి కిలకిలారావాలతో బస్టాండ్ ఆవరణ అంతా పక్షుల విడిదిగా మారిపోతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఈ బస్ స్టాండ్ ఆవరణలోని భారీ వృక్షాలు కొన్నేళ్లుగా ఈ వందలాది రామచిలుకలకు ఆవాసంగా నిలుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం కోసం సమీప ప్రాంతాల్లో విహరించే ఈ పక్షులు, తిరిగి సాయంత్రం బస్ స్టాండ్ కు చేరుకుంటాయి. ఒకేసారి అవి ఆకాశంలో ఎగిరే దృశ్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పట్టణ జీవనంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని ఈ చిలుకల సందడి కల్పిస్తుంది. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు సైతం తమ మొబైల్ ఫోన్లలో ఈ అందమైన దృశ్యాలను బంధిస్తున్నారు. స్థానికులు కూడా ప్రతిరోజు సాయంత్రం వేళ ఈ పక్షుల రాకను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను భావితరాలకు అందించగలమని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో భారీ జాబ్ స్కామ్! ఒక్క వీడియోతో బుక్కైన నిందితులు! నిందితుల వాట్సప్ చాట్‌ వైరల్

ఓటర్లకు గొప్ప శుభవార్త.. ఆ రూల్ ఎత్తేసిన ఎన్నికల సంఘం.. ఇలా చేస్తే మీ ఓటు సేఫ్

రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు

అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి

ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *