Headlines

Madhuri Dixit: 60కు దగ్గరైనా మెరిసిపోయే చర్మం.. మాధురి దీక్షిత్ బ్యూటీ సీక్రెట్ ఇదే.. చాలా సింపుల్


Madhuri Dixit: 60కు దగ్గరైనా మెరిసిపోయే చర్మం.. మాధురి దీక్షిత్ బ్యూటీ సీక్రెట్ ఇదే.. చాలా సింపుల్

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన నటనతో పాటు అందానికి కూడా బాగా ఫేమస్. ఆమెకు ఇప్పుడు 59 ఏళ్లు. కానీ ఈ వయసులోనూ యంగ్ హీరోయిన్లకు మించిన అందం ఆమె సొంతం. మాధురి చర్మం ఇప్పటికీ చాలా ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అందుకే మాధురి అందం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు.సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు తమ చర్మ సంరక్షణ కోసం ఏవేవో టిప్స్ పాటిస్తుంటారని, సామాన్యులు వాటిని పాటించలేరనుకుంటారు చాలా మంది. అయితే అది నిజం కాదంటోంది మాధురి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ కు హాజరైన ఈముద్దుగుమ్మ తన స్కిన్ కేర్ రొటీన్ ను అందరితో పంచుకున్నారు. ఇది చాలా సులభమైనది ఎవరైనా పాటించవచ్చు. మీకు కూడా మాధురి లాంటి మెరిసే చర్మం కావాలంటే, మీరు కూడా ఈ చిట్కాలను ప్రయత్నించవచ్చు. స్కిన్ కేర్ రొటీన్ లో ఒక మంచి మాయిశ్చరైజర్ చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ, మన చర్మం సహజ రక్షణ పొర బలహీనపడుతుంది. ఒక మంచి మాయిశ్చరైజర్ చర్మం వాడడం వల్ల చర్మంలోని నీరు ఆవిరైపోకుండా నివారిస్తుంది. ముఖంపై ఉండే సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడి, చర్మాన్ని నునుపుగా, మృదువుగా ఉంచుతుంది.

మాధురీ దీక్షిత్ చర్మ సంరక్షణలో SPF (Sun Protection Factor) చాలా ముఖ్యం. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండటానికి సన్‌స్క్రీన్ ఉత్తమ పరిష్కారం. సూర్యుని UV కిరణాలు మీ చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్‌లను నాశనం చేస్తాయి, దీనివల్ల ముడతలు ఏర్పడతాయి. అందువల్ల, పగటిపూట మంచి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం చాలా అవసరం. ఇక చర్మం ముడతలు రాకుండా, మంచి యాంటీ-ఏజింగ్ చర్మ సంరక్షణ దినచర్యను పాటించాలనుకుంటే, అందులో రెటినాయిడ్స్‌ను తప్పకుండా చేర్చుకోండి. ఇవి కణాల పునరుద్ధరణను ప్రేరేపించి, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గుతాయి. అయితే, వీటిని మీ చర్మ సంరక్షణ దినచర్యలో ఎల్లప్పుడూ పరిమితంగానే చేర్చుకోవాలి. ముఖ్యంగా మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని వాడండి.

మాధురీ దీక్షిత్ స్కిన్ కేర్ రొటీన్ ను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది: ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మానికి ఖరీదైన రకరకాల ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. మీ చర్మ అవసరాలను అర్థం చేసుకుని, సరైన పదార్థాలు ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడమే కీలకం. గుర్తుంచుకోండి, చాలా ఉత్పత్తులను వాడటం కంటే, సరైన ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఉపయోగించడం చాలా ముఖ్యం.

మాధురి బ్యూటీ సీక్రెట్ ఆమె మాటల్లోనే..

 

View this post on Instagram

 

A post shared by Dr Ruchi Agarwal | Dermatologist (@drruchiagarwal)

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *