Headlines

ఓటర్లకు గొప్ప శుభవార్త.. ఆ రూల్ ఎత్తేసిన ఎన్నికల సంఘం.. ఇలా చేస్తే మీ ఓటు సేఫ్


ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించిన భారత ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో లక్షలాది మంది అర్హుల పేర్లు ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యాయి. దీనిపై ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో, ఈసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటర్ల వివరాల నమోదు, ధృవీకరణకు గడువును నవంబర్ 30 నుండి డిసెంబర్ 22 వరకు పొడిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ కొత్త షెడ్యూల్ అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి భారీ ఊరటనిస్తూ, ఆన్‌లైన్ ఫారం-6 దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిక్లరేషన్ నిబంధనను ఈసీ పూర్తిగా తొలగించింది. దీంతో కొత్త ఓటు నమోదు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ASDD (Absent, Shifted, Dead, Duplicate) జాబితాలో పొరపాటున చేరిన నిజమైన ఓటర్లకు న్యాయం చేయడానికి ప్రత్యేక ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టింది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరించి, అర్హులైన వారి ఓటును తిరిగి జాబితాలో చేర్చేందుకు సహాయపడనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు

అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి

ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ

40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ

బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్‌ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్‌ అమలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *