టాలీవుడ్‌ను పైరసీ భూతం మరోసారి పట్టి పీడిస్తోంది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొత్త సినిమాలను థియేటర్ల నుండి అక్రమంగా రికార్డ్ చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఘటనలు ఆగడం లేదు. తాజాగా, కొన్ని తెలుగు సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్‌లలో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ముఖ్యంగా, కర్నూలులోని ఓ మల్టీప్లెక్స్‌లో సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసినట్లు గుర్తించారు. రణబలి, కల్ట్, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, ఆకాశంలో ఒక తార వంటి చిత్రాలు ఈ పైరసీకి గురైన వాటిలో ఉన్నాయి. ఫోరెన్సిక్ విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్ నుండి రికార్డింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ మణీంద్ర బాబు యర్రా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పైరసీ వెనుక ఉన్న వ్యక్తులు, థియేటర్‌లో రికార్డ్ చేసింది ఎవరు, వెబ్‌సైట్ నిర్వాహకులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదో అన్ ప్రెడిక్టబుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.51కే అన్‌లిమిటెడ్ కాల్స్
మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్
తిరుపతిలో మరో కొత్త నగరం.. అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో మెగా టౌన్‌షిప్
ఏపీలో 2,111 టీచర్ పోస్టులు..సబ్జెక్టుల వారీగా పోస్టుల లిస్ట్..ఇలా దరఖాస్తు చేసుకోండి