Headlines

ఇదో అన్ ప్రెడిక్టబుల్ ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ!


ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమ ప్రత్యేకమైన రచనా శైలి, కథన నైపుణ్యంతో విజయాలు సాధిస్తున్నారు. తమకు తామే అవకాశాలను సృష్టించుకుంటూ, తమ ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇదే కోవలో యంగ్ డైరెక్టర్ అనుదీప్ రెడ్డి తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. అనుదీప్ రెడ్డి తెరకెక్కించిన పారడాక్స్ హరికథ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఒక అన్ ప్రిడిక్టబుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. రొటీన్ ప్రేమ కథలకు భిన్నంగా, ఒక జంట జీవితంలోకి ఊహించని విధంగా మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేసింది. తెలుగు సినిమాల్లో సాధారణంగా సరదాలకు మాత్రమే పరిమితమైన బావా మరదళ్ల బంధాన్ని, ఇంతకు ముందెన్నడూ చూడని ఒక సరికొత్త డ్రామా, విభిన్నమైన మలుపులతో చూపించబోతున్నట్లు దర్శకుడు అనుదీప్ రెడ్డి తెలిపారు. ఈ సినిమా మనసుకు హత్తుకునే భావోద్వేగ ప్రయాణంలా ఉంటుందని, పల్లెటూరి నేపథ్యంలో సాగినప్పటికీ, సాధారణ గ్రామీణ కథల్లో ఉండే పాత పద్ధతులన్నింటినీ పక్కకు పెట్టి, సరికొత్త జానర్‌ను జత చేస్తున్నట్లు అనుదీప్ అన్నారు. కుటుంబ భావోద్వేగాలకు తెలుగు సినిమాలు పెట్టింది పేరు కాగా, తన సినిమా వాటికి ఒక అరుదైన, సరికొత్త దృక్పథాన్ని అందిస్తుందని వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ.51కే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్

తిరుపతిలో మరో కొత్త నగరం.. అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో మెగా టౌన్‌షిప్

ఏపీలో 2,111 టీచర్ పోస్టులు..సబ్జెక్టుల వారీగా పోస్టుల లిస్ట్..ఇలా దరఖాస్తు చేసుకోండి

Hyderabad: హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *