Headlines

విమానాశ్రయంలో లగేజీ బ్యాగులపై గోధుమ రంగు జిగట పదార్థం! ఏంటది?


American Airlines Passengers Shocked As Luggage Emerges Covered In Sticky Brown Substance

Sticky Brown Substance on Luggage: అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో ఈ వింత చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 2609 సోమవారం మయామి నుంచి అట్లాంటాకు చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు విమానం ల్యాండ్‌ అయింది. ప్రయాణికులు తమ బ్యాగుల కోసం రెండు గంటలు వేచి చూశారు. ఇంతసేపు ఎదురు చూసిన తర్వాత లగేజీ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ బ్యాగుల పరిస్థితి చూసి మళ్లీ ఆందోళనకు గురయ్యారు.

టిక్ టాక్ వీడియోతో ఘటన వెలుగులోకి

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికుడు డెరిక్‌ మెకల్లమ్‌ టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశారు. కన్వేయర్ బెల్ట్‌పై వస్తున్న బ్యాగులపై గోధుమ రంగు పదార్థం అంటుకుని ఉండటం చూస్తూ ఆయన.. ‘ఇప్పుడు బ్యాగులు వస్తున్నాయి వాటిపై మలం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది దానిని వీక్షించారు. మరో టిక్‌టాక్‌ యూజర్‌ స్పందించారు. బ్యాగులపై ఉన్న పదార్థం పుడ్డింగ్‌లా కనిపిస్తోందని పేర్కొన్నారు. అసలు అది ఏమిటో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. తమ బ్యాగులు ఇలా ఎందుకు మారిపోయాయో అర్థంకాక ఆందోళన చెందారు.

మలం కాదు.. కరిగిన పీనట్ బటర్‌!

ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది. బ్యాగులపై కనిపించిన గోధుమ రంగు పదార్థం మలం కాదని, పీనట్ బటర్‌ అని స్పష్టం చేసింది. ఓ ప్రయాణికుడు తన చెక్‌-ఇన్‌ బ్యాగులో ఆహార పదార్థాన్ని పెట్టుకుని ప్రయాణించాడని విమాన ప్రయాణ సమయంలో ఆ పదార్థం లీకై, సమీపంలో ఉన్న ఇతర ప్రయాణికుల బ్యాగులపై పడిందని వివరించింది. అయితే ఆ పీనట్ బటర్‌ ఎలా లీకైంది? ఎంతమంది ప్రయాణికుల బ్యాగులకు అంటుకుంది? అనే వివరాలను వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి



బ్యాగులు శుభ్రం చేయాల్సిన పరిస్థితి.. పరిహారం సంగతేంటి?

ఈ ఘటనతో ఇబ్బందిపడిన కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగులను తామే శుభ్రం చేసుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఎంతమంది లగేజీ ఈ ఘటనలో దెబ్బతింది? వాటిని శుభ్రం చేయడానికి లేదా కొత్త బ్యాగులు కొనుగోలు చేయడానికి ఎయిర్‌లైన్స్‌ పరిహారం ఇస్తుందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో లగేజీ ఆలస్యంగా రావడం, దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ రెండు గంటల నిరీక్షణ తర్వాత చేతికి అందిన బ్యాగులన్నీ పీనట్ బటర్‌తో తడిసిపోయి కనిపించడం మాత్రం ప్రయాణికులకు ఊహించని అనుభవంగా మిగిలిపోయింది. లగేజీలో పెట్టుకున్న ఓ ఆహార పదార్థం ఇతరుల బ్యాగులకు ఇంత పెద్ద సమస్య తెచ్చిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *