Headlines

వైకుంఠ చతుర్దశి: శివుడిని, విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే సకల శుభాలు మీవే.. ఈ తప్పులు మాత్రం చేయకండి!


Vaikuntha Chaturdashi Puja Vidhi Telugu: హిందూ సంప్రదాయంలో వైకుంఠ చతుర్దశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివుడు, విష్ణుమూర్తిని ఒకేసారి పూజించే ఈ పర్వదినాన్ని హరి-హర మిలన్ అని కూడా పిలుస్తారు. 2026లో వైకుంఠ చతుర్దశి నవంబర్ 23, సోమవారం నాడు జరుపుకోనున్నారు. కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ రోజున శివ, విష్ణువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తే దైవానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

వైకుంఠ చతుర్దశి నాడు ఏం చేయాలి?

ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు సిద్ధం కావాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులు, శివుడికి బిల్వ పత్రాలు సమర్పించడం ఆనవాయితీ. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’, ‘ఓం నమః శివాయ’ మంత్రాలను జపించవచ్చు. విష్ణు సహస్రనామం, శివ చాలీసా వంటి స్తోత్రాలను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇంట్లో లేదా ఆలయంలో 14 దీపాలు వెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, నువ్వులు, బెల్లం, నెయ్యి, పండ్లు వంటి వాటిని దానం చేయడం మంచిదని విశ్వాసం.

ఈ పనులు మాత్రం చేయకండి

  1. తులసి ఆకులు కోయకండి: వైకుంఠ చతుర్దశి రోజున తులసి ఆకులను కోయకుండా, ముందుగానే తీసుకున్న ఆకులను విష్ణుమూర్తి పూజకు ఉపయోగించాలని సంప్రదాయం చెబుతుంది.
  2. తామసిక ఆహారానికి దూరంగా ఉండండి: మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటిని నివారించి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని భావిస్తారు.
  3. ఇవి కూడా చదవండి



  4. గొడవలు, దూషణలకు దూరంగా ఉండండి: ఈ పవిత్ర రోజున కోపం, అసూయ, ద్వేషం, వాదనలకు దూరంగా ఉండి ప్రశాంతంగా గడపాలని పెద్దలు సూచిస్తారు.
  5. శివ, విష్ణువుల మధ్య భేదం చూపవద్దు: వైకుంఠ చతుర్దశి హరి-హరుల ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఇద్దరు దేవతలను సమాన భక్తితో పూజించడం ఈ రోజున ప్రత్యేకతగా చెబుతారు.

వైకుంఠ చతుర్దశి ప్రాముఖ్యత

పురాణ కథనం ప్రకారం, ఒకసారి విష్ణుమూర్తి శివుడికి వెయ్యి తామర పుష్పాలతో పూజ చేయాలని సంకల్పించారు. పూజ సమయంలో ఒక తామర పువ్వు తక్కువ కావడంతో, తన కన్నును తామర పువ్వుగా భావించి శివుడికి సమర్పించేందుకు సిద్ధపడ్డారు. ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున శివ, విష్ణువులను కలిసి పూజించడం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతాలు, కుటుంబ సంప్రదాయాలను బట్టి ఆచారాల్లో మార్పులు ఉండవచ్చు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *