ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి తన సిరా చిత్రంపై తరచుగా ఎదురయ్యే ఒక కీలకమైన ప్రశ్న, “ఆ సినిమా కథాంశం గందరగోళంగా ఉంది, అసలు అర్థం కాలేదు” అన్నదానికి తాజాగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందినా, చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాకపోవడంపై ఆయన తన లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు. భరణి మాట్లాడుతూ, సిరా సినిమాకు మంచి పేరు వచ్చిందని, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయని ఒప్పుకుంటూనే, అది ఎంత మందికి అర్థం కాలేదనే వాదనను కూడా అంగీకరించారు. “అర్థం కాలేదన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు” అని ఆయన అన్నారు. దీనికి సమాధానంగా, “మేఘం మనకేమైనా అర్థమవుతుందా? ఒక ఫార్మేషన్ ఉంటుంది, కానీ పది మంది దానికి పది రకాలుగా ఊహించుకుంటారు. యద్భావం తద్భవతి” అంటూ ఒక ఉపమానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సినిమా వెనుక ఉన్న కాన్సెప్ట్ యూరోపియన్ ఫిలాసఫీ నుండి వచ్చిందని భరణి వివరించారు. పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు వెస్టర్న్ థియేటర్, వరల్డ్ వార్ సమయంలో పుట్టిన కళా ఉద్యమాల గురించి తెలుసుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మానవజాతి ఊహించలేని విధ్వంసాన్ని, నిరాశను చవిచూసింది. ఇళ్లు, ఆత్మీయులు క్షణాల్లో కనుమరుగైపోయారు. ఈ నిర్వేదం, జీవితం అబద్ధం, మిథ్య అనే భావన సర్రియలిజం అనే ఇజానికి జన్మనిచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
“అంతా అబద్ధం రా, మిథ్య. అన్నీ… ఒక్క నా కొడుకు పలకరించట్లేదు, అన్నీ అబద్ధాలు… ఇట్లాగే ప్రపంచం మిథ్య అని ఒక ఇజం పుట్టింది. సర్రియలిజం. ఇది ఫస్ట్ పోయెట్రీలో వచ్చింది, తర్వాత పెయింటింగ్‌లో వచ్చింది, తర్వాత డ్రామాస్‌లో వచ్చింది” అని భరణి పేర్కొన్నారు. సర్రియలిస్టిక్ కాన్సెప్ట్‌కు ఉదాహరణగా ఒక అత్తాకోడళ్ల కథను ఆయన వివరించారు: కోడలు అత్తగారు చనిపోవాలని కోరుకుంటుంది, అత్త చనిపోగానే న్యాయంగా కోడలు సంతోషంగా ఉండాలి, కానీ వాస్తవానికి ఒక రకమైన భావోద్వేగ సంఘర్షణ, ఖాళీతనం ఉంటుంది. ఈ అంతర్గత వేదనను, టెర్రరిజంపై ఉన్న వేదనను సింబాలిక్‌గా సిరా చిత్రంలో చూపించానని ఆయన అన్నారు. “సూర్యుడు ఒకడే, కానీ నీకో సూర్యుడు, నాకో సూర్యుడు అంటాం. అట్లాగే… దాంట్లో నానార్థం అర్థం లేక కాదు. అర్థం ఉన్నది, అర్థం కాక.”
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
సర్రియలిజం, డాడాయిజం, ఇమేజిజం, అబ్సర్డిటీ వంటి కాన్సెప్టులు మనకు అంతగా పరిచయం లేవని భరణి అన్నారు. “అబ్సర్డ్ థియేటర్. అసంబద్ధత జీవితం. నిన్నటి దాకా నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి, రేపు ఇంకోడితో కార్ లో వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఏమంటాం? అసంబద్ధత. ఒక అమ్మాయి, అబ్బాయి, మామ కార్ లో వెళ్తున్నారు, సంబరంగా. టక్కమని ఎవడో గుద్దాడు, పిల్ల చచ్చిపోయింది. అసలు దీనికి అర్థం ఉందా ఏమైనా?” అంటూ జీవితంలోని అసంబద్ధ సంఘటనల ద్వారా కలిగే వేదనను చూపడమే ఈ కళా ప్రక్రియ లక్ష్యమని ఆయన వివరించారు. సిరా చిత్రాన్ని “I made it for only intellectuals” అని ఆయన స్పష్టంగా చెప్పారు. “నేను అది మామూలు వాళ్ళ కోసం తీయలేదని చెప్పా స్పష్టంగా. వాళ్లకే వేశా, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో వేశా.” 2008లో ఒక అంతర్జాతీయ ఫెస్టివల్లో అవార్డు తీసుకున్నప్పుడు, జర్మన్ డైరెక్టర్ “ఇట్స్ ఫెంటాస్టిక్. వాట్ ఏ… వాట్ ఏ విజువల్!” అని తనతో వ్యక్తిగతంగా అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సినిమాలు ఇతర దేశాల్లో చాలా ఉన్నాయని తెలిపారు. తన కెరీర్లో సిరా ఉత్తమమైన పనిగా ఆయన అన్నారు. మిథునం వంటి చిత్రాలను రిక్షావాడి కోసం, మంటవాడి కోసం తీశానని, కానీ సిరా కళాత్మకతను ఆస్వాదించగల మేధావుల కోసం ఉద్దేశించినదని ఆయన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..