Headlines

Telangana: ఉద్యోగం వచ్చిన వారానికే వెంటాడిన మృత్యువు.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి


ఉన్నత చదువుల కోసమని అమెరికాకు వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు పట్టణానికి చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ (25) కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అయితే వారం రోజుల క్రితమే సాయితేజకు ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని సాయితేజ కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ ఎంతో సంతోషించారు. కానీ ఈ సంతోషం వారికి వారం రోజులు కూడా మిగలలేదు. అంతలోనే కుమారుడి మరణవార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

కొత్త ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో సాయితేజ నడుపుతున్న వాహనానికి సడెన్‌గా ఒక జింక అడ్డు వచ్చింది. దీంతో అదుపు చేయలేక జింకను ఢీకొట్టిన వాహనాన్ని.. వెనక నుంచి వచ్చిన మరికొన్ని వాహనాలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో సాయితేజకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఇక సాయితేజ స్నేహితుల సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కుమారుడికి ఉద్యోగం వచ్చింది, ఇక అంతా హ్యాపీ అనుకునే సమయంలో ఇలా ఊహించని ప్రమాదంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *