Headlines

నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ.. ఏకంగా 91 లక్షల గోల్డ్‌ కొట్టేసిన ఉద్యోగి


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ ఉద్యోగి అన్నం పెడుతున్న సంస్థనే దారుణంగా మోసం చేశాడు. గత 15 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఒక మేనేజరే తన యజమాని కళ్లుగప్పి, ఏకంగా రూ. 91 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను కాజేశాడు. నాగ్‌పూర్‌లోని పంచపావలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్డగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర ఫతేచంద్ కొఠారీకి ఇందోరా చౌక్ సమీపంలో బంగారు నగల దుకాణం ఉంది. ఈ షాపులో తరుణ్ మోహన్‌లాల్ నహతా గత పదిహేనేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సుదీర్ఘకాలంగా పనిచేస్తుండటంతో యజమాని సురేంద్రకి అతడిపై మంచి నమ్మకం ఏర్పడింది. దీన్ని ఆసరగా చేసుకున్న మేనేజర్ తరుణ్, తన సొంత ప్రయోజనాల కోసం యజమానికి తెలియకుండా షాపులో చేతివాటం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 2026, మార్చి 31 నుండి నవంబర్ 11వ తేదీ మధ్య కాలంలో దుకాణం నుంచి విడతలవారీగా బంగారు ఆభరణాలను మాయం చేశాడు. ఇటీవల షాపులోని స్టాక్‌ను తనిఖీ చేయగా ఈ భారీ మోసం బయటపడింది. మొత్తం 706 గ్రాములు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 91, 3,790 ఉంటుందని అంచనా వేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యజమాని సురేంద్ర వెంటనే పంచపావలి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు తరుణ్‌పై నమ్మకద్రోహం, మోసం, నిధుల దుర్వినియోగం కింద కేసు నమోదు చేశారు. దొంగిలించిన బంగారాన్ని నిందితుడు ఎక్కడ విక్రయించాడు? ఈ భారీ చోరీ వెనుక మరెవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌

గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

వామ్మో.. గిరినాగు.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..

మనిషి మొహంలో పిల్లి రూపం.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *