ప్రపంచానికి షాకిస్తున్న చైనా మాస్టర్ ప్లాన్. అమెరికా డాలర్‌కు చెక్ పెట్టడానికి డ్రాగన్ కంట్రీ చేస్తోన్న భారీ కుట్ర ఇదేనా? కేవలం ఒక్క నెలలో ఏకంగా 26 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేయడానికి అడుగు దూరంలో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నప్పటికీ, చైనా మాత్రం తన గోల్డ్ షాపింగ్‌ను అస్సలు ఆపడం లేదు. సరిగ్గా అక్టోబర్ నెలలో చైనా సెంట్రల్ బ్యాంక్ ఏకంగా 26 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. విశేషం ఏంటంటే, చైనా ఇలా నిరంతరంగా బంగారం నిల్వలను పెంచుకోవడం ఇది వరుసగా 24వ నెల కావడం గమనార్హం. ఈ కొనుగోళ్లతో కలిపి చైనా అధికారిక బంగారు నిల్వలు దాదాపు 2,435 టన్నులకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, జర్మనీ, ఇటలీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక 2,437 టన్నుల బంగారంతో నాలుగో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌కు అత్యంత సమీపంలోకి చైనా వచ్చేసింది. త్వరలోనే ఫ్రాన్స్‌ను దాటేసి నాల్గవ స్థానానికి ఎగబాకనుంది. మరి ఈ రేసులో మన భారత్ ఎక్కడ ఉంది? మన దేశం వద్ద దాదాపు 880 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో బంగారం వాటా పరంగా చూస్తే భారత్ చాలా పటిష్టంగా ఉంది. మొత్తానికి అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడానికి, భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకే చైనా ఈ విధంగా గోల్డ్ రిజర్వ్‌ను విపరీతంగా పెంచుకుంటోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ.. ఏకంగా 91 లక్షల గోల్డ్ కొట్టేసిన ఉద్యోగి
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్ సంచలన కామెంట్స్
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
వామ్మో.. గిరినాగు.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..