నందమూరి బాలకృష్ణ సినిమాలు అనగానే అభిమానులకు పంచ్ డైలాగులు, మాస్ డ్యాన్సులు, థ్రిల్లింగ్ ఫైట్లు గుర్తుకు వస్తాయి. అయితే అప్పటికే మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న బాలయ్య, తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 50వ సినిమాకు ఎలాంటి ఫైట్స్ లేని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారి నిర్మించిన ఆ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. 1990 ఏప్రిల్ 27న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో బాలయ్యను అంతవరకు చూడని విధంగా జనాలు చూశారు. ముఖ్యంగా ఆయన సహజమైన నటన సినిమాకు మరో హైలెట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ చిత్ర కథా ప్రస్థానం 1988లో ప్రారంభమైంది. జంట రచయితలు శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్‌లతో నిర్మాత కాట్రగడ్డ మురారి చర్చలు జరిపారు. సినిమాకు ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను మొదట శివశక్తి దత్త సూచించినప్పటికీ, ఆరంభంలో దానికి నిర్మాత అంగీకరించలేదు. ఆ తర్వాత ఇతర ప్రాజెక్టుల కారణంగా దత్తా బ్రదర్స్ తప్పుకోగా, వారిచ్చిన మూల కథ ఆధారంగా డి.వి. నరసరాజు, జంధ్యాల, సత్యమూర్తి, భమిడిపాటి రాధాకృష్ణ, తనికెళ్ల భరణి వంటి 11 మంది రచయితలతో ఏడాది పాటు చర్చించి స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేశారు. 1989 మార్చిలో షూటింగ్ ప్రారంభించాలని భావించి, కేవీ మహదేవన్ సంగీతంలో పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు. అయితే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ షూటింగ్ కారణంగా బాలకృష్ణ బిజీ అవడంతో, ఈ సినిమా షూటింగ్ ఎనిమిది నెలల పాటు వాయిదా పడి 1989 డిసెంబర్ 3న మొదలైంది. తొలుత హీరోయిన్లుగా శాంతిప్రియ, సీతలను అనుకున్నప్పటికీ, ఆలస్యం వల్ల ఆ స్థానాల్లోకి శోభన, నిరోషా వచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చెన్నైలోని వేలచ్చేరిలో మెగాస్టార్ చిరంజీవికి చెందిన ‘హనీ హౌస్’ గెస్ట్ హౌస్‌లో ఈ చిత్ర షూటింగ్ మొత్తం జరిగింది. ఇద్దరు భామల మధ్య, అత్త రుసరుసల మధ్య సాగే ఆహ్లాదకరమైన కథలో బాలకృష్ణ సహజమైన నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దానికి తోడు కేవీ మహదేవన్ స్వరపరిచిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో, ఫైట్స్ లేకపోయినా ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి 45 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. బాలయ్య కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..