Headlines

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో తెలంగాణలో కొత్త టెన్షన్ –


నాగార్జున సాగర్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో జల వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు తాగునీటి ప్రాజెక్టును నాగార్జున సాగర్ వెనుక భాగం నుండి దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతోంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. నల్గొండ ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతులు లేకుండా ఏపీ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇది 1.35 టీఎంసీల నీటిని తరలించే “జలదోపిడి” అని తెలంగాణ భావిస్తోంది. ఇప్పటికే ఈ అక్రమ నిర్మాణాలపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని, రాబోయే సమావేశాల్లో దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా సాగుతున్న ఈ పనులను అక్రమంగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?

హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?

స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *