Headlines

OTT Movie: హారర్, ట్విస్ట్, సస్పెన్స్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమా ఇదే.. అస్సలు మిస్ అవ్వకండి..


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మలయాళ సినిమాలు ఎప్పుడూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటాయి. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్‌ల కంటే కేవలం బలమైన కథ, సహజమైన నటన, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే ప్రధాన ఆయుధాలుగా మలయాళ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్, సైకలాజికల్ హర్రర్ జోనర్‌లో వస్తున్న సినిమాలు కేవలం మాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఓటీటీ వేదికల విస్తృతి పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు భూతకాలం. 2022లో విడుదలైన ఒక మలయాళ చిత్రం ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటి రేవతి, షేన్ నిగమ్, సైజు గ్రూప్ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

ముఖ్యంగా రేవతి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి గల ఈ చిత్రం, సాధారణ హారర్ చిత్రాలకు భిన్నంగా పూర్తిగా విభిన్నమైన కథాంశాన్ని కలిగి ఉంది. తల్లి కొడుకులు.. రహస్యమయమైన ఇల్లు! వితంతువు అయిన తల్లి పాత్రలో రేవతి, ఆమె కొడుకు పాత్రలో షేన్ నిగమ్ కనిపించారు. కుటుంబంలో ఒక మరణం సంభవించిన తర్వాత, వారిద్దరూ నివసించే ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఇంట్లో ఎవరో ఉన్నారనే భావన, వింత శబ్దాలు, అతీంద్రియ సంఘటనలు, అన్నీ వారిని భయపెడతాయి. కానీ అక్కడ నిజంగా ఏం జరుగుతోంది? వారు దెయ్యాన్ని ఎదుర్కొంటున్నారా లేక వారి మనసులోని గందరగోళమా అనే ప్రశ్న సినిమా అంతటా మనల్ని వెంటాడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

షైన్ నిగమ్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన అద్భుతమైన మలయాళ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమా ‘భూతకాలం’ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా, ప్రస్తుతం సబ్ టైటిల్స్‌తో పాటు పలు భాషలలో డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *