Headlines

తండ్రి Vs కొడుకు.. బాక్సాఫీస్ వద్ద విచిత్ర పోరు!


సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు సరికొత్త పోరు జరగబోతోంది. తండ్రీ కొడుకులైన మమూకా.. దుల్కర్ సల్మాన్ ఇద్దరూ.. తమ సినిమాలో బాక్సాఫీస్‌ మందుకు పోటీ పడబోతున్నారు. దీంతో ఈ పోరు కాస్తా ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు, దుల్కర్ తండ్రి లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓం’ (O.M) కూడా సరిగ్గా నవంబర్ 20నే విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మమ్ముట్టి ఒక అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళ హీరోలైన తండ్రీకొడుకులు ఇద్దరూ పక్క ఇండస్ట్రీల సినిమాలతో ఒకే రోజు పోటీ పడుతుండటం సినీ అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వస్తుంటే.. మరోవైపు మమ్ముట్టి స్ట్రెయిట్ తమిళ సినిమాతో బాక్సాఫీస్ ముందు పోటీకొస్తున్నారు.మరి నవంబర్ 20న జరగబోయే ఈ విచిత్రమైన బాక్సాఫీస్ పోరులో కొడుకు తెలుగులో హిట్ కొడతాడా..? లేక తండ్రి తమిళంలో సత్తా చాటుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్

Ashu Reddy: పెళ్లి గిల్లీ సెట్టవ్వవు.. అప్పట్లో తాగేదాన్ని కానీ ఇప్పుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *