Headlines

కొండపై గుండె ఆకారంలో సరస్సు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత ప్రదేశం..ఆ అందాన్ని చూస్తే..


భారతదేశం పర్యాటక రంగంలో ఎన్నో వింతలకు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉంది. మన దేశంలో ఎన్నో నదులు, జలపాతాలు, సరస్సులు ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలో కేవలం గుండె ఆకారంలో మాత్రమే ఉండే ఒక అద్భుతమైన సరస్సు గురించి మీకు తెలుసా? అదే కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన వయనాడ్‌లో ఉన్న చెంబ్రా లేక్. ఈ అరుదైన సరస్సు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చెంబ్రా శిఖరంపై ప్రకృతి సిగలో…

కేరళలోని వయనాడ్ జిల్లా కల్పేట్ట పట్టణానికి సమీపంలో ఈ చెంబ్రా పర్వతం ఉంది. ఇది వయనాడ్‌లోనే అత్యంత ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి దాదాపు 2,100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండల మీద ఈ గుండె ఆకారపు సరస్సు సహజసిద్ధంగా ఏర్పడింది. చుట్టూ పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు, ఎల్లప్పుడూ అలముకునే పొగమంచు మధ్య ఈ సరస్సు కనువిందు చేస్తుంది.

లవర్స్ ప్యారడైజ్, ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం

ఈ సరస్సు చూడటానికి సరిగ్గా గుండె ఆకారంలో ఉండటం వల్ల దీనికి హార్ట్ షేప్డ్ లేక్ అనే పేరు వచ్చింది. దీనిని హృదయ సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ ప్రత్యేకతే ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను, ముఖ్యంగా జంటలను అమితంగా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా, ఇది సాహస ప్రియులకు ఒక అద్భుతమైన ట్రెక్కింగ్ డెస్టినేషన్. అటవీ శాఖ వారి అనుమతితో పర్వతం ఎక్కుతూ ప్రయాణం చేయడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి



ప్రత్యేక ఆకర్షణలు, సందర్శనకు సరైన సమయం

ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ నీరు ఎప్పుడూ ఎండిపోదని స్థానికులు చెబుతుంటారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత పచ్చగా మారి కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే వయనాడ్ ప్రకృతి సౌందర్యం మొత్తం కంటికింపుగా కనిపిస్తుంది. కేరళ, వయనాడ్ జిల్లా, కల్పేట్ట సమీపంలో ఉంటుంది ఈ చెంబ్రా హిల్స్. ఇక్కడికి వెళ్లేందుకు..సెప్టెంబర్ నుండి మార్చి నెలల మధ్య కాలం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ట్రిప్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతమైన ప్రకృతి అద్భుతాలలో చెంబ్రా లేక్ ఒకటి. మీ భాగస్వామితో లేదా స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకుంటే వయనాడ్‌లోని ఈ హృదయ ఆకారపు సరస్సు ఒక చక్కటి ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *