Headlines

అవునా.. పచ్చిబొప్పాయి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్క కూడా వదిలిపెట్టరు!


అవునా.. పచ్చిబొప్పాయి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్క కూడా వదిలిపెట్టరు!

ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో పచ్చి బొప్పాయి ఒకటి. సాధారణంగా మనం పండిన బొప్పాయిని తినడానికి ఇష్టపడతాము, కానీ పండకముందే కోసే ఈ పచ్చి కాయలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. బరువు తగ్గడం నుంచి గాయాలను నయం చేయడం వరకు పచ్చి బొప్పాయి వల్ల అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణక్రియ:

పచ్చి బొప్పాయి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ‘పపైన్’ అనే జీర్ణ ఎంజైమ్ అత్యధిక సాంద్రతలో లభిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణశయాన్ని శుభ్రపరచి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దరిచేరనీయకుండా చేస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు పచ్చి బొప్పాయిని సలాడ్స్ రూపంలో తీసుకోవడం మంచిది. ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్, స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనాన్ని కలిపిస్తూ, అతిగా తినే అలవాటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి మెరుగు:

పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపల నుండి యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిలోని ఫైబర్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

ఇందులోని విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి. పచ్చి బొప్పాయిలో ఉండే లాటెక్స్ ఎంజైమ్ శరీరం లోపలి భాగాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

పచ్చి బొప్పాయి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో క్యారెట్లు, టమాటాల కంటే ఎక్కువ మొత్తంలో కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ ఎ గా రూపాంతరం చెంది, కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

గాయాలను త్వరగా మాన్పుతుంది:

పచ్చి బొప్పాయిలోని పోషకాలు శరీరంలో వాపును తగ్గించడంలో, గాయాలను వేగంగా మాన్పడంలో సహాయపడతాయి. దీనిలోని ఫైటోన్యూట్రియంట్లు కొత్త కణాలు తయారవడానికి తోడ్పడతాయి. కాబట్టి, మీ ఆహారంలో పచ్చి బొప్పాయిని చేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *