Headlines

Fahadh Faasil: ఓ చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. భార్యపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర కామెంట్స్


సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందమైన జోడీల్లో ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ జంట కూడా ఒకటి. 2014లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ మధ్యన వీరు విడాకుల తీసుకుంటున్నారని వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌లది ప్రేమ వివాహం. వీరు ‘బెంగళూరు డేస్‌’ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇరు పెద్దల ఆశీర్వాందతో 2014లో వీరు పెళ్లిపీటలెక్కారు. కాగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా బయటకు చెప్పరు. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో ఫహాద్- నజ్రియా సరదాగా చేసే వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుటాయి. అలా తాజాగా మరోసారి తన భార్య నజ్రియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఫహాద్. వివరాల్లోకి వెళితే.. ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో , సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారం (అక్టోబర్ 02)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్ సారా పాలేకర్ గురించి మాట్లాడారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఆమె చూపించిన ఓపిక, నటన కోసం చేసిన సన్నాహకాలను ఫహాద్ ప్రత్యేకంగా‌ ప్రశంసించారు. ఇదే క్రమంలో తన భార్య నజ్రియాను ప్రస్తావిస్తూ సరదాగా మాట్లాడారు. ‘నేను కూడా ఓ చిన్నపిల్ల లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అందుకే పిల్లలను చూసుకోవడంలో మీకు ఇంత ఓపిక వచ్చింది. కొందరు నన్ను అడుగుతుంటారు. ఇంత ఓపిక ఎక్కడిది అని. ఇంట్లోనే ఒకరు ఉన్నారు.. ఆమెను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్తుంటాను’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు ఫహాద్. ఇదే సందర్భంగా నటి సారా పాలేకర్‌ తనతో ఎంతో ఓపికగా వ్యవహరించారని, ఇప్పటివరకు తనకు ఇంత ఓపిక ఉన్న సహనటి మరొకరు ఎదురుకాలేదని ఈ మలయాళం స్టార్ ప్రశంసలు కురిపించారు.

ఇక సినిమా విషయానికి వస్తే ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఈ రోజు ( మంగళవారం)హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *