Headlines

రాంచి లో విచిత్ర ఘటన.. మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి


జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక విచిత్రమైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా నవ్వులు పూయించింది. రాంచీ సమీపంలోని ఒక మద్యం దుకాణంలోకి అకస్మాత్తుగా ప్రవేశించిన ఒక ఆడ కోతి, అందరూ చూస్తుండగానే మద్యం సేవించి ఆ మత్తులో అక్కడే హాయిగా నిద్రపోయింది. ఈ అరుదైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఒక కోతి హఠాత్తుగా స్థానిక లిక్కర్ షాప్‌లోకి చొరబడింది. లోపలికి వెళ్లిన ఆ కోతి కొద్దిసేపు షాపు అంతా అటూ ఇటూ కలయతిరిగింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అక్కడున్న ఒక మద్యం బాటిల్‌ను తన చేతిలోకి తీసుకుని, దాని మూత తీసి మద్యాన్ని తాగేసింది. కొద్దిసేపటికే ఆ ఆల్కహాల్‌ ప్రభావంతో కోతికి మత్తు ఎక్కింది. ఫలితంగా, అటూ ఇటూ కదలకుండా షాపులోనే ఓ మూలన హాయిగా కళ్లు మూసుకుని గాఢ నిద్రలోకి జారుకుంది. షాపులో కోతి నిద్రపోతున్న ఈ విచిత్ర దృశ్యాన్ని చూసి షాపు యజమానితో పాటు అక్కడికి వచ్చిన వినియోగదారులు తొలుత అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకోలేక తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఈ వింత ఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున షాపు ముందు గుమిగూడారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన రెస్క్యూ టీం, అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆల్కహాల్ మత్తులో గాఢనిద్రలో ఉన్న కోతికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఎంతో జాగ్రత్తగా, సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మద్యం తాగి మత్తెక్కిపోయిన ఆ కోతి ప్రవర్తించిన తీరు అక్కడున్న వారందరినీ ఒకవైపు ఆశ్చర్యానికి గురిచేయగా, మరోవైపు నవ్వించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త.. 30 రోజుల ప్లాన్ తప్పనిసరి

సినిమా రేంజ్ ఛేజింగ్.. కారుపై వేలాడుతూ 40 కి.మీ వెళ్లిన కానిస్టేబుల్

ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి భయంతో పరుగు

బుల్లెట్‌ ట్రైన్‌లో టీమ్‌ ఇండియా.. ఆటగాళ్ల రియాక్షన్‌ చూస్తే

PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *