తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవ్వబోతున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డికి అవకాశం కల్పించింది.
అయితే ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను టీపీసీసీ ఎంపిక చేసిన హైకమాండ్‌కు పంపంగా.. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ తాజాగా అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కీలక ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి వర్గానికే కేటాయించడం ఇక్కడ గమనార్హం.
అవును నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికైన సర్వోత్తం రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.