మకర రాశి: రాశ్యధిపతి శని విదేశీ స్థానాలైన భాగ్య, వ్యయ స్థానాలను వీక్షించడం, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి, దశమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి త్వరలో తప్పకుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం, విదేశీ నివాస యోగం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ తప్పకుండా జరుగుతుంది.