ఒకప్పుడు హీరోయిన్స్ పాత్రలు కేవలం పాటలు, గ్లామర్ సన్నివేశాలకే పరిమితం కాకుండా కథలో కీలకంగా ఉండేవి. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మకమైన, ఎమోషనల్ పాత్రలను ఎంచుకునేవారు. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తమలోని ప్రతిభను నిరూపించుకున్నారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్లను ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు. కొన్ని పాత్రలు నటన పరంగా సవాల్‌గా ఉన్నప్పటికీ, వాటిని అంగీకరించి తెరపై అద్భుతంగా పండించారు. అందులో భాగంగానే ఈ హీరోయిన్ కూడా తనకు వచ్చిన అవకాశాల్లో విభిన్నతను చూపించేందుకు ప్రయత్నించింది. ఆమె పోషించిన కొన్ని పాత్రలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, నటిగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అందుకే అప్పటి సినీ ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పేరు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ అర్చన.
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
లెజెండరీ నటి ఆర్చన తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన బాలూ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన నిరీక్షణ సినిమా గురించి. అలాగే ఆ చిత్రంలోని తన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించిన తీరు, ఆ పాత్ర యొక్క ఐకానిక్ గెటప్ గురించి ఆమె మాట్లాడారు. షూటింగ్ సమయంలో ఏదైనా భయం లేదా అసౌకర్యం అనిపించిందా.? అన్న ప్రశ్న అడిగినప్పుడు. ఆ సమయంలో నేను బ్లౌజ్ లేకుండా చీరలో నటించాను. అప్పుడు నేను దర్శకుడిని నమ్మాను. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కడా అశ్లీలత లేదు. కాబట్టి ఆయనపై పూర్తి నమ్మకంతో ఆ సినిమాలో నటించాను. ఆ క్యారెక్టర్‌లో ఏదో ఒక పవిత్రతను మాత్రమే చూశాను నేను అని బదులిచ్చారు. ఆ పాత్ర తనను ఎంతగానో ఆకర్షించిందని, అది చేయాలనే కోరిక తప్ప మరేదీ తన మనసులో లేదు ఆమె అన్నారు. నేను ఎప్పుడూ ధైర్యవంతురాలిని అని అర్చన అన్నారు.
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
శరీరానికి సంబంధించిన సున్నితమైన వయసులో అలాంటి పాత్రను ఎలా పోషించగలిగారని ప్రశ్నించగా, అర్చన ఆ పాత్ర ఒక చరిత్రను సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అందుకే మీరు ఈరోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది ఒక చరిత్రను సృష్టించింది” అని ఆమె అన్నారు. 300-400 చిత్రాలు చేసిన సీనియర్ నటీమణులు ఉన్నప్పటికీ, కేవలం 30 సినిమాలు కూడా దాటని తన చిత్రాలు ప్రత్యేకంగా నిలిచి ప్రజల మదిలో నిలిచిపోయాయని అర్చన ఆనందంగా పేర్కొన్నారు. నిరీక్షణ చిత్రం తన కెరీర్‌కు ఒక విశిష్టతను తెచ్చిపెట్టిందని ఆమె స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.