Headlines

శాలరీ స్లిప్ అక్కర్లేదు.. సులువుగా పెన్షన్ ఖాతా.. యూపీఐ ద్వారా సెకన్లలోనే చెల్లింపులు..


పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కీలక నిర్ణయం తీసుకుంది. స్థిరమైన ఆదాయం లేని అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక పెన్షన్ ఖాతాను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఆదాయపు పన్ను పరిధిలో లేని కార్మికుల కోసం ఈ ప్రత్యేక పథకం తీసుకొచ్చే యోచనలో ఉంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులవుతారు. కేవలం ఒకే క్లిక్‌తో పెన్షన్ ఖాతా ప్రారంభించడంతో పాటు యూపీఐ ద్వారా కార్మికులు చెల్లింపులు చేయవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ఖాతా తెరిచి నిర్వహించుకోవచ్చు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకకు స్ధిరమైన పదవీ విరమణ నిధిని సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఖాతాను PFRDA త్వరలో తీసుకురానుంది.

త్వరలో ఈ పెన్షన్ ఖాతా అమలు కోసం డిజిటల్ వ్యవస్థను అభివృద్ది చేయనున్నారు. అనంతరం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. ఎలాంటి పేపర్ ప్రక్రియ అవసరం లేకుండా డిజిటల్ విధానంలో ఈ ఖాతాను సులువగా తెరవొచ్చు. యూపీఐ ద్వారా సెకన్లలోనే ఈ ఖాతాను నిధులు బదిలీ చేయవచ్చు. ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ-శ్రమ్ డేటా బేస్‌లో ఉన్న వివరాలను ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఉపయోగించుకోనున్నారు. ఈ-శ్రమ్‌లో నమోదైన కార్మికులు అందులోని వివరాలను ఉపయోగించి ఈ ఖాతాను సులభంగా తెరవొచ్చు. నిమిషాల్లోనే ఖాతాను తెరిచి డబ్బులను జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవస్థను పరిశీలిస్తున్నామని PFRDA ఛైర్‌పర్సన్ శివసుబ్రమణియన్ రామన్ స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులు పదవీ విరమణ నిధిని నిర్మించుకోవడానికి ఇది ఉపయోగపడనుంది.

అసంఘటిత రంగంలో పనిచేసేవారికి శాలరీ స్లిప్‌లు లాంటివి ఉండవు. దీంతో వాటి అవసరం లేకుండానే ఈ పెన్షన్ ఖాతా తెరవొచ్చు. అటు త్వరలో ఎన్‌పిఎస్ స్వస్థ్య స్కీమ్‌ను ప్రారంభించే పనిలో కేంద్రం ఉంది. ఆసుపత్రి సంబంధిత ఖర్చుల కోసం వారు పోగు చేసుకున్న పెన్షన్ పొదుపులో కొంత భాగాన్ని పొందేందుకు ఇది వీలు కల్పించనుంది. పెన్షన్ పొదుపుల నుండి లభించే మొత్తానికి మించి అదనపు కవరేజీని అందించేందుకు ఒక అనుసంధానిత టాప్-అప్ బీమా ఉత్పత్తిని ఏర్పాటు చేస్తారు. ఈ బీమా టాప్-అప్ ప్రారంభంలో చెల్లించిన మొత్తానికి సుమారు ఎనిమిది నుండి పది రెట్లు ఉండవచ్చు. రెండు పింఛను నిధులతో ఇప్పటికే ఎన్‌పిఎస్ స్వస్థ్య పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. భీమా కంపెనీలతో భాగస్వామ్యాల ద్వారా అన్ని పింఛను నిధులు ఈ సౌకర్యాన్ని అందించగలగాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి తుది మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశముంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *