Headlines

Tollywood : ఆ హీరోతో సాంగ్ అంటే చాలా భయమేసింది.. అతడిని చూసి ఆశ్చర్యపోయా.. ప్రియమణి..


ప్రముఖ హీరోయిన్ ప్రియమణి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ నైపుణ్యాలు, వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె తమ యమదొంగ సినిమా అనుభవాలను పంచుకుంటూ, ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయడం తనకెలా అనిపించిందో వివరించారు. ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం అంటే తనకు భయంగా అనిపించిందని, నిజంగా ఒక టెర్రర్ లాంటి అనుభూతిని ఇచ్చిందని ప్రియమణి అన్నారు. “ఎన్టీఆర్ గారితో మీరు చేసిన సినిమా యమదొంగ. సో ఆయన డాన్స్ గురించి ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆయన పక్కన డాన్స్ చేయడం ఎలా అనిపించింది?” అన్న ప్రశ్నకు ప్రియమణి సమాధానమిస్తూ, “భయంగా అనిపించింది. చాలా అంటే చాలా భయంగా అనిపించింది. నేను చెప్పాలంటే నిజంగా ఒక టెర్రర్ లాగ అనిపించింది,” అని అన్నారు. ఎన్టీఆర్ స్టెప్స్ నేర్చుకునే వేగాన్ని ఆమె ప్రస్తావిస్తూ, “తను ఒక సాంగ్ లో ఒక సిక్స్ స్టెప్స్ ఉంటే, తను ఒక్కసారి అలా చూసి, అలా వెళ్లి, అలా చేసేస్తారు,” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను మూడు, నాలుగు రోజుల పాటు రిహార్సల్స్ చేసినా కూడా స్టెప్స్ సరిగ్గా రావని, అయితే ఎన్టీఆర్ మాత్రం అద్భుతంగా చేస్తారని ప్రియమణి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఎన్టీఆర్ పుట్టుకతోనే డ్యాన్సరని ప్రియమణి అన్నారు. “బట్ హి ఇస్ ఏ బార్న్ డాన్సర్, ఐ కెన్ సే. సో తనకి, ఆ గ్రేస్ కావచ్చు, ఆ రిథం కావచ్చు, తనకి ఒక మ్యూజిక్ పెడితే, దానికి తగ్గట్టుగా, తను స్టెప్స్ మూవ్ చేయడం, అన్ని చాలా ఈజీగా వచ్చేస్తుంది తనకి,” అని ఆమె అన్నారు. తన కెరియర్‌లో స్టెప్స్ మ్యాచ్ చేయడానికి ఎన్టీఆర్ అత్యంత కష్టమైన డ్యాన్సర్ అని ప్రియమణి పేర్కొన్నారు. ఆయనకు ఒక పాటను ప్లే చేస్తే, దానికి తగ్గ స్టెప్స్‌ను చాలా సహజంగా, సునాయాసంగా చేసేస్తారని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

డ్యాన్స్‌తో పాటు, ఎన్టీఆర్ నటనలోని పరివర్తన గురించి కూడా ప్రియమణి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అండ్ ఇంకో విషయం ఏంటంటే, తను సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. బట్ ఒకసారి కెమెరా ముందు వచ్చి, ఒకసారి యాక్షన్ అని చెప్తే, అస్సలు వేరే మనిషిలాగా ఉంటారు,” అని ప్రియమణి వెల్లడించారు. సెట్‌లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, తక్కువగా మాట్లాడే ఎన్టీఆర్, కెమెరా ముందు మాత్రం పూర్తిగా మారిపోయి, వేరే వ్యక్తిలాగా నటిస్తారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే, అస్సలు నమ్మలేము. అదేంటి, ఇంత సైలెంట్ గా ఉన్న మనిషి, ఇంత ఎలా అయిపోయాడు అని,” అని ప్రియమణి అన్నారు. నటుడిగా ఇది గొప్ప లక్షణమని, ఎన్టీఆర్ దానిని చాలా బాగా మెయింటెయిన్ చేస్తారని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎన్టీఆర్..

Priyamani, Jr Ntr

Priyamani, Jr Ntr

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *