Headlines

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ సక్సెస్ మీట్.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే?


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ మూవీ పేరు తెగ మార్మోగుతుంది. స్వయంగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ అగ్రనేత కేటీఆర్ సైతం ది ప్యారడైజ్ సినిమాను చూసేందుకు థియేటర్ కు వెళుతున్నాననడం ఆసక్తికరంగా మారింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జడల్ అనే పాత్రలో నాని అదరగొట్టాడు. హీరోయిన్ గా కయాదు లోహర్ అందంగా కనిపించింది. ఇక శికంజా మాలిక్ అనే క్రూరమైన విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అదరగొట్టారు. కొన్ని సీన్లలో అయితే మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారని క్రిటిక్స్ చెబుతున్నారు. ఇక సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి రూ. 114 కోట్ల వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ చిత్ర బృందం శనివారం (సెప్టెంబర్ 26) సక్సెస్ మీట్ నిర్వహించింది. నాని, శ్రీకాంత్ ఓదెల, మోహన్ బాబుతో సహా చిత్ర బృందమంతా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు చాలా ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా తనకు తమ్ముడిలాంటి గద్దర్‌ను గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. గద్దర్‌ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నాకు తమ్ముడి లాంటి వారు గద్దర్‌. ఆయన పిల్లలు మా స్కూల్‌లోనే చదువుకున్నారు. రచయితలు అంటే నాకు చాలా ఇష్టం’ అని ఎమోషనల్ అయ్యారాయన. ఈ సందర్భంగా ఓ రచయిత మృతి చెందిన విషయం తనకు తెలిసిందని గుర్తుచేసుకున్న మోహన్‌బాబు.. ఆయన కుమారుడిని వేదికపైకి పిలిపించి మాట్లాడారు. అతడు ప్రస్తుతం ఏం చదువుతున్నాడని అడిగారు. ఫార్మసీ చదువుతున్నానని అతడు చెప్పడంతో.. ‘‘మా దగ్గర ఎం.ఫార్మసీ కూడా ఉంది’’ అని మోహన్‌బాబు తెలిపారు.ఇదే వేదికగా అతడికి రెండు సంవత్సరాల పాటు ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు మోహన్ బాబు. ‘నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి అవ్వాలి’’ అంటూ సదరు విద్యార్థిని ఆశీర్వదించారు.

ది ప్యారడైజ్ సక్సెస్‌ మీట్‌ వేదికగా మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పైకి గంభీరంగా కనిపించినా మోహన్ బాబు చాలా మంచి వారని, ఆయన విద్యకు చాలా ప్రాధాన్యమిస్తారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఒక విద్యార్థికి ఉచిత విద్య ప్రసాదించడం ద్వారా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మోహన్ బాబు స్పీచ్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *